మురగదాస్ తప్పు ఒప్పుకున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్, ఎ.ఆర్.మురగదాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ 'సర్కార్'. ఈ నవంబర్ 6న విడుదలవుతుంది. అయితే వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత ఈ కథ నాది అంటూ రచయితల సంఘానికి ఆరోపించడమే కాకుండా.. చెన్నై హైకోర్టులో కేసు వేశాడు. కథకు సంబంధించిన కేసు పరిశీలించిన న్యాయస్థానం విచారణ చేసింది.
చివరకు ఎ.ఆర్.మురగదాస్ కథ వరుణ్ రాజేంద్రన్దే అని ఒప్పుకున్నాడు. టైటిల్ కార్డ్స్‌లో వరుణ్ రాజేంద్రన్ పేరు వేస్తానని అంగీకరించారు. దీంతో వివాదం ముగిసింది. ఎట్టకేలకు సర్కార్ విడుదలకు అన్ని మార్గాలు సుగమం అయ్యాయి.దీంతో ముందు తానే ఓ సన్నివేశం స్ఫూర్తిగా కథను రాసుకున్నానని అంగీకరించిన ఎ.ఆర్.మురగదాస్ తన తప్పును ఒప్పుకున్నట్టు అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments