హరీష్ కాళ్లు పట్టుకున్న మంత్రి.. నిజమా? అబద్దమా!?
Send us your feedback to audioarticles@vaarta.com
అవును.. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి కట్టప్పలా ఉంటున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. హరీష్ కాళ్లకు మొక్కారని.. అయితే వెంటనే హరీష్ అయ్యో ఏంటిది అని ఆయన్ను వారించారని పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు ఇందుకు సంబంధించిన ఫొటో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆసక్తికర ఘటన బల్కంపేట ఎల్లమ్మతల్లి కళ్యాణోత్సవ సమయంలో ఈ ఘటన జరిగిందని టాక్ నడుస్తోంది. ఈ సీన్ చూసి భక్తులంతా ఆశ్చర్యపోయారట.
అబ్బే అదేం లేదు..!
అయితే ఇది ఎంత వరకు నిజం..? అనేది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైందట. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి హరీశ్ రావు చెవిన పడటంతో ఎట్టకేలకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చేశారు. "ఈ వార్త పూర్తిగా అవాస్తవం. గౌ.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేలమీది నుండి లేచినిలబడేందుకు ప్రయత్నిసుండగా సాయపడ్డాను. దీన్నితప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారు. ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది బాధాకరం. భవిష్యత్లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణ చేసుకుని ప్రచురించాలని కోరుతున్నాను" అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
కాగా.. గతంలోనూ ఓ జాతీయ పత్రిక హరీశ్ రావుపై ఏదో ఒక వార్త రాసేసి చివర్లో ఏప్రిల్ పూల్ అంటూ హంగామా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఆ పత్రిక వివరణ ఇచ్చుకుంది కూడా. అయితే తాజా వ్యవహారంపై సదరు పత్రిక ఎలా రియాక్ట్ అవుతుందో.. క్షమాపణలు చెబుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments