మణిశర్మ మళ్ళీ కాపీ కొట్టాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెలోడీ పాటలకు చిరునామాలా ఉండే సంగీత దర్శకులలో మణిశర్మ ఒకరు. అందుకే ఆయన మెలోడీ బ్రహ్మ అనిపించుకున్నారు. అయితే.. ఆ పాటల్లో సొంత బాణీలు ఉన్నట్టే.. కొన్ని కాపీ ట్యూన్స్ కూడా ఉన్నాయి. తాజాగా విడుదలైన ఓ పాట ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. కాస్త వివరాల్లోకి వెళితే.. అల్లు శిరీష్, సురభి జంటగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం అనే పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కోసం మణి అందించిన నేపథ్య సంగీతంకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక శుక్రవారం సాయంత్రం ఈ సినిమాకి సంబంధించి ఓ సింగిల్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. సో మెనీ సో మెనీ అంటూ సాగే ఈ పాటని వింటే.. అటుఇటుగా ఏడాది క్రితం విడుదలై యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన షేప్ ఆఫ్ యు అనే పాట గుర్తుకి రాకమానదు.
లిరిక్స్ ని మినహాయిస్తే.. మిగతాదంతా సేమ్ టు సేమ్. మణి ఈ పాటని కాపీ కొట్టారో లేకపోతే ఇన్స్పైర్ అయి ఇచ్చారో కానీ.. ఈ పాటపై విమర్శలు మాత్రం బాగానే ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com