'జాను' తో శర్వాకి సమస్యా?
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా శర్వానంద్, సమంత కలిసి నటించిన `జాను`. తమిళంలో విజయవంతమైన `96`కి ఇది రీమేక్. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. దిల్‌రాజు ఆశించిన ఊహించిన దాంట్లో సగం కూడా సక్సెస్ కాలేదు. భారీ నష్టాలనే మూటగట్టుకున్నాడు. ఈ సినిమా వల్ల దిల్‌రాజు డబ్బు పరంగా నష్టాన్ని చూశాడు. సమంతకు పెద్దగా పోయేదేమీ లేదు. ఇక ఈ సినిమా వల్ల పెద్దగా ఎఫెక్ట్ అయ్యింది మాత్రం శర్వానంద్ మాత్రమేనట. ఎందుకంటే జాను ఎఫెక్ట్‌తో శర్వా నెక్ట్స్ మూవీ `శ్రీకారం`పై పెద్ద ఎఫెక్టే పడిందట.
ఈ సినిమాను ఏప్రిల్ 24న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. సినిమా తుది దశ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ ఇంకా పూర్తి కానేలేదట. ఈ సినిమా దర్శకుడు కూడా కొత్తవాడు కావడంతో సినిమా అంతా శర్వానంద్‌పైనే ఆధారపడి నడుస్తుంది. అయితే శాటిలైట్ హక్కుల విషయంలో మరీ దారుణంగా బేరాలొస్తున్నాయట. ఇది నిర్మాతలను చాలా బాగా ఇబ్బంది పెడుతుందట. పడి పడి లేచె మనసు, రణరంగం సినిమాలు దారుణంగా దెబ్బతీశాయి. మినిమం హిట్ అవుతుందనకున్న జాను కూడా ప్లాప్ కావడంతో శర్వానంద్‌కు మార్కెట్ పరంగా సమస్య క్రియేట్ అయ్యిందని గుసగుసలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com