'జాను' తో శ‌ర్వాకి స‌మ‌స్యా?

  • IndiaGlitz, [Saturday,February 22 2020]

రీసెంట్‌గా శ‌ర్వానంద్‌, స‌మంత క‌లిసి న‌టించిన 'జాను'. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన '96'కి ఇది రీమేక్‌. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది. దిల్‌రాజు ఆశించిన ఊహించిన దాంట్లో సగం కూడా స‌క్సెస్ కాలేదు. భారీ న‌ష్టాల‌నే మూట‌గ‌ట్టుకున్నాడు. ఈ సినిమా వ‌ల్ల దిల్‌రాజు డ‌బ్బు ప‌రంగా న‌ష్టాన్ని చూశాడు. స‌మంతకు పెద్ద‌గా పోయేదేమీ లేదు. ఇక ఈ సినిమా వ‌ల్ల పెద్ద‌గా ఎఫెక్ట్ అయ్యింది మాత్రం శ‌ర్వానంద్ మాత్ర‌మేన‌ట‌. ఎందుకంటే జాను ఎఫెక్ట్‌తో శ‌ర్వా నెక్ట్స్ మూవీ 'శ్రీకారం'పై పెద్ద ఎఫెక్టే ప‌డింద‌ట‌.

ఈ సినిమాను ఏప్రిల్ 24న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు. సినిమా తుది ద‌శ షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ ఇంకా పూర్తి కానేలేద‌ట‌. ఈ సినిమా ద‌ర్శ‌కుడు కూడా కొత్తవాడు కావ‌డంతో సినిమా అంతా శ‌ర్వానంద్‌పైనే ఆధార‌ప‌డి న‌డుస్తుంది. అయితే శాటిలైట్ హ‌క్కుల విష‌యంలో మ‌రీ దారుణంగా బేరాలొస్తున్నాయ‌ట‌. ఇది నిర్మాత‌ల‌ను చాలా బాగా ఇబ్బంది పెడుతుంద‌ట‌. ప‌డి ప‌డి లేచె మ‌న‌సు, ర‌ణ‌రంగం సినిమాలు దారుణంగా దెబ్బ‌తీశాయి. మినిమం హిట్ అవుతుంద‌న‌కున్న జాను కూడా ప్లాప్ కావ‌డంతో శ‌ర్వానంద్‌కు మార్కెట్ ప‌రంగా స‌మ‌స్య క్రియేట్ అయ్యింద‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

సినిమా ప్లాప్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ కార‌ణ‌మంటున్న డైరెక్ట‌ర్‌!!

సినిమా మేకింగ్ స‌మ‌యంలో అన్నీ స‌రిగ్గానే ఉంటాయి. హిట్ అయితే అంద‌రూ దాని ఫ‌లితాన్ని పొందాల‌నుకుంటారు.

ట్రంప్‌ పర్యటనకు కోటి మంది.. ఆర్జీవీ ఐడియా!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడి తొలి భారత పర్యటన ప్రారంభం కానుంది.

ట్రంప్‌తో విందుకు కేసీఆర్.. ప్రత్యేక ఆహ్వానం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 600 యాప్‌లు తొలగింపు!

అవును మీరు వింటున్నది నిజమే.. ఒకట్రెండు కాదు ఏకంగా 600 మంది యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడం జరిగింది.

రోజంతా లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్థి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో..!

విద్యార్థినీలు ఉన్న హాస్టల్‌లోకి బాయ్స్‌కు అనుమతి ఉండదన్న విషయం తెలిసిందే. అయితే.. అబ్బే ఈ షరతులు అందరికీ వర్తిస్తాయ్ కానీ నాకు కాదు అనుకున్నాడేమో కానీ..