చిరంజీవికి పెను ప్రమాదం తప్పిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పిందని మీడియా వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. చిరంజీవి వ్యక్తిగత పనిపై ముంబై వెళ్లారు. అక్కడ పని ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో ఆయన ఎయిర్ విస్తారా ఫ్లైట్ ఎక్కారు. ముంబై నుండి హైదరాబాద్ బయలు దేరిన ఈ విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది. అది గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్నిముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేశాడట. ఈ విమానంలో చిరంజీవి సహా దాదాపు 120 మంది ప్రయాణీకులున్నారట. అసలేం జరుగుతుందో తెలియక కాసేపు ప్రయాణీకులు గందరగోళానికి గురయ్యారట.
ప్రయాణీకుల ఇబ్బందులు...
ఫ్లైట్ టేకాఫ్‌లో సమస్య లేకపోయినా.. టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్య వచ్చిందట. అయితే పైలట్ ముందుగానే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందట. లేకుంటే ప్రాణ నష్టం జరుగుండేదని అంటున్నారు. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ప్రయాణీకులు తదుపరి విమానం కోసం గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిందట. ఎయిర్ విస్తారా సంస్థ మరో విమానాన్ని సిద్ధం చేసి ప్రయాణీకులను గమ్య స్థానానికి చేర్చిందట.
ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మాత. బ్రిటీష్ వారిని ఎదిరించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ హిస్టారికల్ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా సైరా నరసింహారెడ్డి థియేటర్స్‌లో సందడి చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments