చిరంజీవికి పెను ప్ర‌మాదం త‌ప్పిందా?

  • IndiaGlitz, [Saturday,August 31 2019]

మెగాస్టార్ చిరంజీవికి పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని మీడియా వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. చిరంజీవి వ్య‌క్తిగ‌త ప‌నిపై ముంబై వెళ్లారు. అక్క‌డ ప‌ని ముగించుకుని హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు. తిరుగు ప్ర‌యాణంలో ఆయ‌న ఎయిర్ విస్తారా ఫ్లైట్ ఎక్కారు. ముంబై నుండి హైద‌రాబాద్ బ‌య‌లు దేరిన ఈ విమానంలో సాంకేతిక స‌మ‌స్య వ‌చ్చింది. అది గుర్తించిన పైల‌ట్‌ వెంట‌నే విమానాన్నిముంబైలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసేశాడ‌ట‌. ఈ విమానంలో చిరంజీవి స‌హా దాదాపు 120 మంది ప్ర‌యాణీకులున్నార‌ట‌. అస‌లేం జ‌రుగుతుందో తెలియ‌క కాసేపు ప్ర‌యాణీకులు గంద‌ర‌గోళానికి గుర‌య్యార‌ట‌.

ప్ర‌యాణీకుల ఇబ్బందులు...

ఫ్లైట్ టేకాఫ్‌లో స‌మ‌స్య లేక‌పోయినా.. టేకాఫ్ అయిన కాసేప‌టికే విమానంలో సాంకేతిక స‌మ‌స్య వ‌చ్చిందట‌. అయితే పైల‌ట్ ముందుగానే స‌మస్య‌ను గుర్తించ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింద‌ట‌. లేకుంటే ప్రాణ న‌ష్టం జ‌రుగుండేద‌ని అంటున్నారు. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ప్ర‌యాణీకులు త‌దుప‌రి విమానం కోసం గంట‌లు వెయిట్ చేయాల్సి వ‌చ్చింద‌ట‌. ఎయిర్ విస్తారా సంస్థ మ‌రో విమానాన్ని సిద్ధం చేసి ప్ర‌యాణీకుల‌ను గ‌మ్య స్థానానికి చేర్చింద‌ట‌.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌. బ్రిటీష్ వారిని ఎదిరించిన స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని ఈ హిస్టారిక‌ల్ మూవీని తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా సైరా న‌ర‌సింహారెడ్డి థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది.

More News

మంత్రి బొత్స మాటలు.. మాజీ మంత్రికి అర్థం కాలేదట

ఏపీ రాజధాని తరలింపుపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతుల్లో ఆందోళన రేపాయి.

రాజధానిలో జనసేనాని.. ‘ఆళ్ల’ ప్రశ్నల వర్షం!

ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

బ్యాంకులపై ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు సంచలన ప్రకటన చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులపై, ఆర్ధిక విధానాలపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆల్‌ ది బెస్ట్‌ యూఎస్‌ కాన్సులేట్‌ : సీఎం జగన్

యూఎస్‌ కాన్సులేట్‌ పదో వార్షికోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ పేరు చెప్పగానే పాక్ మంత్రికి కరెంట్ షాక్!

అవును మీరు వింటున్నది నిజమే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పగానే పాక్ మంత్రికి సడన్‌గా కరెంట్ షాక్ కొట్టింది.