చంద్రబాబులో మార్పొచ్చిందా.. ?
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబులో చాలా మార్పు వచ్చింది..? ఇంతకీ ఇది మార్పా..? బుద్ధొచ్చిందా అని వైసీపీ శాసన సభ్యులే కాదు.. సొంత పార్టీ నేతలే కాదు కూడా చర్చించుకుంటున్నారట. ఇంతకీ ఏ విషయంలో బాబుకు బుద్ధొచ్చింది..? ఎందుకు సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
చంద్రబాబు నానా హంగామా..!
అసెంబ్లీ సమావేశాలు రెండోరోజున శాసన సభ స్పీకర్ ఎన్నిక విషయం విదితమే. అయితే ఈ కార్యక్రమానికి తనను పిలవలేదని.. పిలవని పేరంటానికి తాను ఎందుకొస్తానని అప్పట్లో చంద్రబాబు నానా హంగామా సృష్టించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, మరో ఎమ్మెల్యే వెళ్లి స్పీకర్‌ను చైర్‌లో కూర్చొబెట్టారు. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబును సీఎం జగన్ పిలవకపోవడంపై అటు టీడీపీ-వైసీపీ సభ్యుల మధ్య పెద్ద రచ్చేజరిగింది. అయితే మంగళవారం జరిగిన డిప్యూటీ స్పీకర్‌ను దగ్గరుండి ఆయన స్థానంలో కూర్చోబెట్టేట్టారు. దీంతో ఇదెట్టా బాబుకు అంత త్వరగా బుద్ధొచ్చింది? అంటూ అటు సభలోని నేతలే కాదు చూస్తున్న ప్రజలూ ముక్కున వేలేసుకున్నారు. మారిన మనిషిని అంటూ గత ఎన్నికల్లో ప్రజలకు టోపీ పెట్టినట్టే తన వైఖరి మారినట్టు సభను నమ్మించేందుకు బాబు తాపత్రయపడుతున్నట్టు ఉందని పలువురు విశ్లేషకులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
స్పీకర్ ఎన్నిక నాడు ఏం జరిగింది..!?
స్పీకర్ తమ్మినేని సీతారామ్ గారి ఎన్నిక సమయంలో సభా సంప్రదాయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు పాటించలేదు. గౌరవప్రదరంగా స్పీకర్‌ను సభలోని పాలక, ప్రతిపక్ష నాయకులు దగ్గరుండి సభాపతిని స్థానంలో కూర్చోబెట్టడం ఎన్నో ఏళ్లుగా సాగుతున్న సంప్రదాయమన్న విషయం విదితమే. కాగా.. గతంలో కోడెలను స్పీకర్‌గా ఎన్నుకున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఆ సంప్రదాయాన్ని పాటించారన్న సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఆ సంప్రదాయాన్ని పాటించకుండా, తన ఉక్రోషాన్ని వెళ్లగక్కడంతో అసెంబ్లీ వేదికగా రచ్చ రచ్చ అయ్యింది. సభలోనే కాదు ఈ వ్యవహారంపై ప్రజలనుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబు చర్యలను ఖండిస్తూ వాఖ్యానాలు, ట్వీట్లు వెల్లువెత్తాయి.
మంగళవారం నాడు మనసు మారింది!
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారిని సీటు వద్దకు తీసుకువెళ్లే సమయంలో చంద్రబాబు స్వయంగా వచ్చారు. సభాపతికి శుభాకాంక్షలు తెలిపి నమస్కారం చేశారు. అయితే ఇదే బుద్ధి ముందు ఉండి ఉంటే ప్రతిపక్ష నేతకు గౌరవంగా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. 40 ఏళ్ల అనుభవం రాజకీయాల్లో ఉందని పదే పదే చెప్పుకున్న చంద్రబాబు సభా మర్యాదలను అతిక్రమించి విమర్శల పాలయ్యారు. స్పీకర్ విషయంలోనూ ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా వ్యవహరించి ఉండాల్సిందని సొంత టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడ్డారట. పోనీలే ఎప్పటికైనా ఆయనకు బుద్ధొచ్చిందని, సభలో ఎలా వ్యవహరించాలో, సభాపతితో ఎలా నడుచుకోవాలో నలభైఏళ్ల అనుభవజ్ఞుడు నెమ్మదిగా నేర్చుకుంటున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments