బీజేపీ వల్లే వైఎస్ జగన్ సీఎం అయ్యారా..!?

  • IndiaGlitz, [Saturday,August 17 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గెలవడానికి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కర్మ, కర్మ, క్రియ బీజేపీనేనా..? అసలు బీజేపీ జగన్‌కు ఏం సాయం చేసింది..? చంద్రబాబుకు ఏం ద్రోహం చేసింది..? అనే విషయాలు బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రోజు మాటల్లోనే తెలుసుకుందాం.

బీజేపీ సపోర్ట్‌తోనా..!?

బీజేపీ సపోర్టుతోనే జగన్ సీఎం అయ్యారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విష్ణుకుమార్ రాజు అన్నారు. అయితే ‘బీజేపీ ఏ విధంగా జగన్‌కు సపోర్ట్ చేసింది..? పోనీ జగనే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏమైనా పోటీ చేశారా..? అనేది విష్ణుకే తెలియాల్సి ఉంది. పోనీ బీజేపీ వల్లే గెలిపించిందంటున్న విష్ణు.. ఈ ఎన్నికల్లో సింగిల్ సీటును కాషాయ పార్టీ ఎందుకు దక్కించుకోలేకపోయింది..? ఎవరినో గెలిపించే బదులు బీజేపీనీ గెలవచ్చు కదా..?. పోనీ సింగిల్ స్థానంలో అయినా పోటా పోటీ అయినా ఇచ్చిన దాఖలాలున్నాయా..? అస్సలే లేవు’ అని వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విష్ణు కుమార్ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతున్నారు.

అపాయిట్మెంట్ కోసం..!

ఈ 70 రోజుల్లో జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు. సీఎం జగన్‌ను కలిసేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన పీఏ స్పందించడం లేదు. ఇది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏవైనా ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ఒక్క రోజులోనే అపాయింట్ మెంట్ దొరికేది. కాంట్రాక్టర్లను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. అధికారులు కుమ్మక్కైతేనే అవినీతి సాధ్యమవుతుంది. జగన్ తీరు చూస్తుంటే ఆయనకు సరైన సలహాదారులు లేరు అనిపిస్తోంది. ప్రజావేదికను ఒక్క రోజులో కూల్చిన జగన్ ప్రభుత్వం ఇసుక పాలసీ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తోంది. ఇసుక పాలసీ ఆలస్యం కావడంతో ఇసుక సరఫరా నిలిచిపోయిందని, నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యని పరిష్కరించాలి అని విష్ణు డిమాండ్ చేశారు.

More News

ఆగస్ట్ 23న బోయ్ చిత్రం..

లక్ష్య, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా బోయ్.

హీరో కావాలనుకోలేదు: రజనీకాంత్

``నేను హీరో కావాలని సినిమా ఇండస్ట్రీకి రాలేదు. విలన్ అవుదామనే వచ్చాను. అయితే నన్ను హీరోగా చేసిన వ్యక్తి కలైజ్ఞానంగారే`` అని అన్నారు

20 శాతం పారితోషకం మాత్రమే తీసుకున్నా: ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో`.

రియల్ ‘హీరో’ మీరే సారూ.. 500 ఇళ్లు కట్టిస్తున్న ‘నానా’!

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈయనకుండే సేవాగుణం అలాంటిది మరి.

నెటిజన్‌ కౌంటర్‌కి మాధవన్ రిప్లై

తమిళ నటుడైన మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన నటించిన తమిళ చిత్రాలు సఖి, చెలి, యువ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి.