ప్రేమ గురించి స్పష్టం చేసిన హర్షవర్ధన్ రాణే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న హర్షవర్ధన్ రాణే.. నటి కిమ్ శర్మతో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు హర్షవర్ధన్ తమ బంధాన్ని రూఢిపరిచారు. "దాచడానికి ఏమీ లేదు. ఆమె కాదని చెప్పలేను. ఎందుకంటే మా జంట ఎక్కడ చూసినా కనిపిస్తోంది.
ఇది నా వ్యక్తిగత విషయం కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఈ విషయంలో ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. ఆమె అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను" అన్నారు హర్షవర్ధన్ రాణే.
అయితే పెళ్లి గురించి మాత్రం ఏ విషయం చెప్పలేదు. ఖడ్గం, మగధీర, ఆంజనేయులు వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. 2010లో ఈమె అలీ పంజానీ అనే బిజినెస్ మేన్ను వివాహం చేసుకున్నారు. 2016లో వారికి చట్టబద్ధంగా విడిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments