గ్లామరస్ అంటే స్కిన్ షో చేయడం కాదు...అదే. - హీరోయిన్ హర్షిక
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్యతేజ, హర్షిక పూనాచా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం అప్పుడలా ఇప్పుడిలా. కె.ఆర్.విష్ణు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జంపా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్ జంపా ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1 న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అప్పుడిలా ఇప్పుడిలా సినిమా హీరోయిన్ హర్షికి తో ఇంటర్ వ్యూ మీకోసం...
చిన్న సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు కదా...రిస్క్ అనిపించలేదా..?
తెలుగులో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. టాలీవుడ్ లో సినిమా బాగుంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్నిసినిమాలు చూస్తారు. అందుచేత మంచి స్ర్కిప్ట్ ఉన్న సినిమాతో పరిచయం అయితే చాలు అనుకున్నాను. అలాగే చిన్న సినిమా అయినా మా నిర్మాత బాగా ప్రమోషన్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా మా సినిమా పోస్టర్స్ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. అందుచేత చిన్న సినిమా ద్వారా పరిచయం అవుతున్నాను అనే ఫీలింగ్ లేదు. సినిమా రిలీజ్ అవుతుంటే చాలా ఎక్సైట్ గా ఉంది.
మీరు నటించిన మూవీ రిలీజ్ అవుతుంటే ఎక్సైట్ అవ్వడానికి కారణం ఏమిటి..?
బాలీవుడ్ తర్వాత పెద్ద ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అని అందరికీ తెలిసిందే. కన్నడలో ఓ 12 సినిమాలు చేసాను. అసలు నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు. 15 సంవత్సాల వయసులోనే హీరోయిన్ అయ్యాను. గత సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తిచేసాను. ఎడ్యుకేషన్ పూర్తయ్యింది కాబట్టి ఇక నుంచి ఫోకస్ అంతా ఏక్టింగ్ కెరీర్ పైనే. అందుచేత తెలుగులో ఎంటర్ అవ్వడానికి ఇది రైట్ టైమ్ అని నా ఫీలింగ్. అప్పుడెలా ఇప్పుడెలా అనే మంచి సినిమాతో తెలుగులో ఇండస్ట్రీలో ప్రవేశిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మనం ఫస్ట్ టైమ్ కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు ఎక్సైట్ అవుతాం. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి నా ఫస్ట్ ఫిలిమ్ రిలీజ్ అవుతున్నందుకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే ఎక్సైట్ మెంట్ తోపాటు టెన్షన్ కూడా ఫీలవుతున్నాను.
ఈ సినిమాలో నటించడానికి మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి..?
ఈ సినిమా చేయడానికి అంగీకరించానంటే దానికి కారణం స్ర్కిప్ట్. అలాగే తెలుగులో నేను చేసే ఫస్ట్ ఫిల్మ్ లో నటకు అవకాశం ఉన్న పాత్ర చేయాలనుకున్నాను. లక్కీగా నేను కోరుకున్నట్టే నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ లభించింది. ఇందులో హీరో - హీరోయిన్ ఈ రెండు క్యారెక్టర్స్ కీ సమానంగా ఇంపార్టెంట్స్ ఉంది. సీనియర్ నరేష్ గారు నా తండ్రి పాత్ర పోషించారు. సుమన్ గారు హీరో తండ్రి పాత్ర పోషించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఫ్యామిలీ అంతా కలసి చూడచ్చు. ఓ మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి ఉంది. అలాగే ఇది ఫ్యామిలీ ఫిల్మ్ అయినప్పటికీ ఆడియోన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి. ఇలా అన్నివర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఉన్నాయి కాబట్టే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను.
కన్నడలో మీరు నటించిన సినిమాలకు అవార్డ్స్ వచ్చాయి కదా..వాటి గురించి చెబుతారా..?
కన్నడలో శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, రమేష్ అరవింద్, అజయ్ రామ్...ఇలా అగ్రహీరోలందరి సరసన నటించాను. నా నటనకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా చెప్పాలంటే శివరాజ్ కుమార్ తో కలసి నటించిన తమస్సు సినిమాలో నా నటనకు కర్నాటక స్టేట్ అవార్డ్ వచ్చింది. ఈ సినిమాకే నాకు ఫిలింఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో కలసి నటించిన జాకీ చిత్రానికి గాను నాకు సైమా అవార్డ్ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను.
మీరు ఎలాంటి సినిమాల్లో నటించాలనుకుంటున్నారు..?
నాకు నటకు అవకాశం ఉన్న పాత్ర చేయడం ఇష్టం. అలాగే మెసేజ్ ఇచ్చే సినిమాలు చేయాలనుకుంటున్నాను. కొన్ని సినిమాలు వారం రోజులు మాత్రమే ఆడతాయి. కానీ అందులో బాగా నటించిన నటీనటులు గుర్తుంటారు. అందుచేత నాకు పెర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలని ఉంది. నేను ఇంజనీరింగ్ చదివాను. యు.ఎస్ వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ...సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అందుకనే ఏక్టింగ్ ని ప్రొఫెషన్ గా ఎంచుకున్నాను. నేను మనీకి ప్రాధాన్యత ఇవ్వను. మంచి పాత్రకే నా ప్రాధాన్యత. క్యారెక్టర్ నచ్చితే రెమ్యూనరేషన్ గురించి ఆలోచించను.
తెలుగులో మీ ఫేవరేట్ హీరో ఎవరు..?
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ నా ఫేవరేట్ హీరోస్.
తెలుగు సినిమాలు చూస్తుంటారా..?
తెలుగు సినిమాలు చూస్తుంటాను. నిన్న ఊపిరి సినిమా చూసాను. బ్యూటీఫుల్ ఫిల్మ్. నాకు చాలా బాగా నచ్చింది. అద్భుతంగా నటించిన నాగార్జున గార్కి సెల్యూట్ చేస్తున్నాను.
మీ రోల్ మోడల్ ఎవరు..?
నా రోల్ మోడల్ అంటే దీపికా పడుకునే. ఎందుకంటే దీపిక బెంగుళూరు నుంచి వెళ్లి బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటిస్తుంది.
మీరు కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయాలనుకుంటున్నారా..?
అవును..బాలీవుడ్ లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సరంలోనే బాలీవుడ్ మూవీ చేస్తున్నాను.
స్కిన్ షో చేయడం గురించి ఏమంటారు..?
సౌందర్య గారు ఎలాంటి పాత్రలు చేసారో మనందరికీ తెలిసిందే. మన పక్కంటి అమ్మాయిలా కనపించే పాత్రలు పోషించి ఎంతగానో ఆకట్టుకున్నారు. అదే గ్లామరస్ అంటే. ఇంకా చెప్పాలంటే... మనల్ని చూసి ఓ బ్యూటీఫుల్ అంటే అదే గ్లామరస్ అని నా ఫీలింగ్. అంతే కానీ..స్విమ్ షూట్, స్కిన్ షో చేయడం కాదు గ్లామరస్ అంటే.
ఫైనల్ గా అప్పుడలా ఇప్పుడిలా సినిమా గురించి ఏం చెబుతారు..?
ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ మంచి సినిమా అప్పుడలా ఇప్పుడిలా. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. తెలుగులో మంచి పాత్రలు చేయాలనుకుంటున్న నన్నుఆదరిస్తారని ఆశిస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments