దేవిశ్రీ ప్లేస్ లో హరీష్ జైరాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ ప్లేస్ లో హరీష్ జైరాజ్ వచ్చాడు. ఇంతకీ ఏ సినిమాకి అంటారా..? సూర్య సింగం 3 మూవీకి. సింగం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి దేవిశ్రీప్రసాదే మ్యూజిక్ అందించాడు. సింగం 3కి కూడా దేవిశ్రీప్రసాదే అనుకున్నారు. కానీ లేటెస్ట్ ఇన్ ఫర్మమేషన్ ప్రకారం సింగం 3 కి హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారట. డిసెంబర్లో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
సూర్య హీరోగా నటించే ఈ చిత్రాన్ని హరి తెరకెక్కించనున్నారు. అనుష్క, శ్రుతి హాసన్ సూర్య సరసన నటించనున్నారు. సింగం 1, సింగం 2 ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయాల్ని సాధించాయి. మరి...దేవిశ్రీ మ్యూజిక్ కాకుండా హరీష్ జైరాజ్ మ్యూజిక్ తో రూపొందుతున్న సింగం 3 ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments