అప్పుడు పెద్దోడు.. ఇప్పుడు చిన్నోడు
Send us your feedback to audioarticles@vaarta.com
హారిస్ జైరాజ్.. కోలీవుడ్‌లో పదేళ్లకు పైగా తన సంగీతంతో ఉర్రూతలూగించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ పేరిది. ఈ మధ్య కాలంలో ఇతని జోరు కాస్త తగ్గిన మాట వాస్తవమే కానీ.. పూర్తిగా ఫేడవుట్ అయితే కాలేదు. మురుగదాస్, గౌతమ్ మీనన్, కె.వి.ఆనంద్‌లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ల సక్సెస్ ఫుల్ జర్నీలో ఇతని పాత్ర చిన్నదేమి కాదు. అలాంటి హారీస్ కి తెలుగులో మాత్రం ఆశించిన విజయాలు దక్కలేదు. 'వాసు, ఘర్షణ, సైనికుడు, మున్నా, ఆరెంజ్'.. ఇలా హారిస్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అతని సంగీతం మాత్రం యువతరం మన్ననలు పొందింది.
అలాంటి హారీస్.. చాలా గ్యాప్ తరువాత తెలుగులో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. అదే మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా. ఇది తెలుగుతో పాటు తమిళంలోనూ ద్విభాషా చిత్రంగా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. తమ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా.. హారీస్‌కి మహేష్ రెండో అవకాశం ఇవ్వడం వార్తల్లో నిలుస్తోంది.
'వాసు' పరాజయం పాలైనా.. హారిస్‌కి 'ఘర్షణ'రూపంలో వెంకటేష్ మరో అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. పెద్దోడు ఛాన్స్ ఇచ్చిన రెండోసారీ హారిస్ కలిసి రాలేదు. మరి చిన్నోడు విషయంలోనైనా కలిసి వస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com