అప్పుడు పెద్దోడు.. ఇప్పుడు చిన్నోడు

  • IndiaGlitz, [Friday,October 23 2015]

హారిస్ జైరాజ్‌.. కోలీవుడ్‌లో ప‌దేళ్ల‌కు పైగా త‌న సంగీతంతో ఉర్రూత‌లూగించిన సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ పేరిది. ఈ మ‌ధ్య కాలంలో ఇత‌ని జోరు కాస్త త‌గ్గిన మాట వాస్త‌వ‌మే కానీ.. పూర్తిగా ఫేడ‌వుట్ అయితే కాలేదు. మురుగ‌దాస్, గౌత‌మ్ మీన‌న్, కె.వి.ఆనంద్‌లాంటి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ల సక్సెస్ ఫుల్ జ‌ర్నీలో ఇత‌ని పాత్ర చిన్న‌దేమి కాదు. అలాంటి హారీస్ కి తెలుగులో మాత్రం ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. 'వాసు, ఘ‌ర్ష‌ణ‌, సైనికుడు, మున్నా, ఆరెంజ్‌'.. ఇలా హారిస్ చేసిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అయితే అత‌ని సంగీతం మాత్రం యువ‌త‌రం మ‌న్న‌నలు పొందింది.

అలాంటి హారీస్.. చాలా గ్యాప్ త‌రువాత తెలుగులో ఓ సినిమాకి క‌మిట్ అయ్యాడు. అదే మ‌హేష్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా. ఇది తెలుగుతో పాటు త‌మిళంలోనూ ద్విభాషా చిత్రంగా రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. త‌మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గ‌త చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. హారీస్‌కి మ‌హేష్ రెండో అవ‌కాశం ఇవ్వ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది.

'వాసు' ప‌రాజ‌యం పాలైనా.. హారిస్‌కి 'ఘ‌ర్ష‌ణ'రూపంలో వెంక‌టేష్ మ‌రో అవ‌కాశం ఇచ్చాడు. ఇప్పుడు మ‌హేష్ కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తున్నాడు. పెద్దోడు ఛాన్స్ ఇచ్చిన రెండోసారీ హారిస్ క‌లిసి రాలేదు. మ‌రి చిన్నోడు విష‌యంలోనైనా క‌లిసి వ‌స్తాడేమో చూడాలి.

More News

అక్క‌డైనా కృతి బోణి బావుంటుందా?

కొంద‌రికి అన్నీ ఉన్నా.. అదృష్టం మాత్రం తోడు కాదు. దాంతో వారి కెరీర్ ఎక్క‌డి వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంటుంది.

సునీల్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

కొంద‌రికి కొన్ని విష‌యాలు భ‌లేగా వ‌ర్క‌వుట్ అవుతాయి. దాంతో ఆ విష‌యాలు తెలియ‌కుండానే సెంటిమెంట్‌గా మారుతాయి.

నిఖిల్‌ నూతన చిత్రం ప్రారంభం

న్యూ జనరేషన్‌కు నచ్చే సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ ‘స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్‌ సూర్య’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ సొంతం చేసుకొని.. యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకొన్న నిఖిల్‌ సిద్దార్థ్.

నెల‌కొక‌టి.. ఇదీ అంజ‌లి లెక్క‌

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు', 'బ‌లుపు', 'గీతాంజ‌లి'.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది తెలుగమ్మాయి అంజ‌లి.

కొలంబస్ మూవీ రివ్యూ

దసరాకు విడుదలైన మూడు సినిమాల్లో యూత్ఫుల్ లవ్ జోనర్లో విడుదలైన సినిమా కొలంబస్. ప్రేమ కోసం వెతికే ఓ ప్రేమికుడి కథే కొలంబస్. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన తెచ్చుకుంది? సుమంత్ అశ్విన్ కు ఈ సినిమా ఎలాంటి సినిమా అవుతుంది? తెలుసుకోవాలంటే ఓ లుక్కేద్దాం.