షాకింగ్ విషయం చెప్పిన హరితేజ.. డెలివరీకి సరిగ్గా వారం ముందు..
Send us your feedback to audioarticles@vaarta.com
‘బిగ్‌బాస్’ ఫేం, నటి హరితేజ ఓ షాకింగ్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆమె తాజాగా ఓ భావోద్వేగ వీడియోను ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకుంది. పాప పుట్టిందని తెలియగానే చాలా మంది విష్ చేశారు. అయితే రిప్లై ఇచ్చే పరిస్థితుల్లో నేనప్పుడు లేను. అయితే పంచుకోవాల్సిన అవసరం లేదు కానీ బయటి పరిస్థితులు చూస్తుంటే నా విషయం తెలిస్తే కాస్త జాగ్రత్త పడతారేమో అనిపించింది. తొమ్మిది నెలల ప్రెగ్నెసీలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. హెల్దీ ఫుడ్ తింటూ చాలా బాగున్నాను. ఆ తరువాతే ఓ షాకింగ్ విషయం తెలిసిందని.. హరితేజ చెప్పుకొచ్చింది.
‘‘డెలివరీకి సరిగ్గా వారం రోజుల ముందు ఆస్పత్రికి వెళ్లాను. వైద్యులు పరీక్షలు చేసి బేబీ ఆరోగ్యంగా ఉందని.. సాధారణ డెలివరీ అవుతుందని చెప్పారు. నాకెంతో సంతోషంగా అనిపించింది. అయితే వారం ముందు ఎలా జరిగిందో ఎవరి కారణంగా జరిగిందో పక్కనబెడితే.. బేబీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో అనుకోనివిధంగా మా కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతో కంగారుగా, భయంగా అనిపించింది. నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. అప్పటి నుంచి భయం మొదలైంది. అప్పటివరకూ నాకు వైద్యం అందించిన డాక్టర్లు డెలివరీ చేయలేమని చెప్పారు. దాంతో నేను కొవిడ్ ఆస్పత్రిలో చేరాను. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రతిరోజూ ఎన్నో టెస్టులు. ఇక పాజిటివ్ కాబట్టి వైద్యులు నార్మల్ డెలివరీ చేయలేమని వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. ఆ టైంలో నాతో ఎవ్వరూ లేరు. నా భర్తకు నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనే నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. తనే రాత్రిపగలూ నాతో ఉండి చూసుకున్నారు.
నేను కోవిడ్ వార్డులో ఉండాల్సి వచ్చింది. సర్జరీ అనంతరం పాప పుట్టింది. పుట్టిన వెంటనే పాపకు కొవిడ్ పరీక్ష చేయగా నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో పుట్టిన వెంటనే బేబీని నాకు దూరంగా ఉంచారు. రోజూ వీడియో కాల్స్ చేసి బేబీని చూసేదాన్ని. పాపకు పాలు ఇవ్వడానికి కూడా లేదు. నాకెంతో బాధగా అనిపించేది. చాలా పెయిన్ అనుభవించాను. చికిత్స అనంతరం నన్ను ఇంటికి పంపించారు. అప్పుడు కూడా మేమిద్దరమే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. కొందరు స్నేహితులు సాయం చేశారు. మనకి జరిగే దాకా కూడా జాగ్రత్త పడం. అలాంటివేమీ వద్దు. ముందే జాగ్రత్తపడటం చాలా మేలు. ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్యానిక్ అవ్వొద్దు. ఎక్కడ పెద్ద సమస్య ఉన్నా.. సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాస్కులు పెట్టుకోవడం లేదు. శానిటైజర్స్ వాడటం లేదు. ముందే జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఇమ్యూనిటిని పెంచే ఫుడ్స్ తినండి. జనసమూహాలకు దూరంగా ఉండండి. దేవుడు దయ వల్ల మా ఇంట్లో వారందరికీ నెగటివ్ వచ్చింది’’ అని హరితేజ వీడియోలో వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com