పసిఫిక్ మధ్యలో గబ్బర్ సింగ్ పాట.. దేవిశ్రీకి హరీష్ బర్త్ డే విషెస్!

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నేడు తన 42వ జన్మదిన వేడుక జరుపుకుంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాస్ కి,యువతకు ఉత్సాహం తెప్పించే విధంగా ఉంటుంది. దాదాపుగా దేవిశ్రీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి చిత్రాలకు వర్క్ చేశాడు. దేవిశ్రీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: పోర్న్ రాకెట్ కేసులో అడ్డంగా బుక్కైన నటి.. ఆమె చేసిన ఘనకార్యం ఇదే!

క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దేవిశ్రీకి బర్త్ డే విషెస్ చెబుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న ఓ షిప్ లో గబ్బర్ సింగ్ చిత్రంలోని ఆకాశం అమ్మాయైతే అనే పాట ప్లే అవుతున్న వీడియోని హరీష్ శంకర్ షేర్ చేశాడు.

'పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఒక చోట నీ సంగీతం అలలతో పోటీ పడుతోంది. నా స్నేహితుడు మెక్సికన్ యాచ్ట్ షిప్ నుంచి ఈ వీడియో పంపాడు. ఇలాంటి మ్యాజిక్ మరోసారి చేసేందుకు ఎదురుచూడలేకున్నా. నీవు మరిన్ని విజయాలు అందుకోవాలి. హ్యాపీ బర్త్ డే దేవిశ్రీ' అని హరీష్ ట్వీట్ చేశాడు.

గబ్బర్ సింగ్ కాంబోలో మరో చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ ల కలయికలో మరో చిత్రానికి అంతా సిద్ధం అయింది. ఇక షూటింగ్ మొదలు పెట్టడమే మిగిలి ఉంది. గబ్బర్ సింగ్ చిత్రానికి దేవీశ్రీ అందించిన మ్యూజిక్ మాస్ ఎపిక్. అంతకు మించేలా పవన్ 28వ చిత్రానికి సంగీతం ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

More News

పోర్న్ రాకెట్ కేసులో అడ్డంగా బుక్కైన నటి.. ఆమె చేసిన ఘనకార్యం ఇదే!

ఓ వైపు బాలీవుడ్ లో రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంటే.. పశ్చిమ బెంగాల్ లో ఈ తరహా కేసు మరొకటి బయట పడింది.

షూటింగ్ ఆపేసి అమెరికాకు రానా.. రూమర్స్ నిజామా?

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి. నటనలో రానా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

మడతేసి తికమక పెడుతున్న జక్కన్న.. దోస్తీ సాంగ్ లో వీటిని గమనించారా ?

ఆదివారం ఫ్రెండ్ షిప్ డే సంధర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి దోస్తీ సాంగ్ విడుదలయింది.

రామ్ సినిమాలో 'మన్మథుడు 2' బ్యూటీ.. రోల్ ఏంటో తెలుసా ?

హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

టోక్యో ఒలంపిక్స్ : సెమీస్ లో పీవీ సింధు ఓటమి.. ఆ ఛాన్స్ ఇంకా ఉంది!

తెలుగు తేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. టోక్యో ఒలంపిక్స్ లో నేడు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆమె ఓటమి చెందింది.