‘వాల్మీకి’ వివాదం: నాకేం తెలీదు కథ మాత్రమే!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్-20న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుపుకున్న చిత్రబృందం.. దర్శక నిర్మాతలు, నటీనటులు మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
వాల్మీకి టైటిల్ వివాదంపై!
ఒక మనిషిలో వచ్చే గొప్ప మార్పుకి ‘వాల్మీకి’ కి మించిన గొప్ప ఉదాహరణ మరొకరు ఉండదు. అందుకే ఈ మూవీకి వాల్మీకి అని టైటిల్ పెట్టడం జరిగింది. ఈ మూవీ కథకు ఆధారమే ఆ పాయింట్. ఆ విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా వివరించడం జరిగింది. వాల్మీకి వివాదం కోర్టులో నడుస్తోంది. విచారణలో ఉన్న విషయాల గురించి మనం బయట మాట్లాడుకోకూడదు. ఆ లీగల్ విషయాలు మా ప్రొడ్యూసర్స్, లాయర్స్ చూసుకుంటున్నారు. టైటిల్ అనేది నిర్మాతలు రిజిస్టర్ చేయించుకుంటారు. డైరెక్టర్స్ కేవలం కథ, స్క్రిప్ట్ మాత్రమే రిజిస్టర్ చేయించుకోవడం జరుగుతుంది అంతేకానీ అంతకు మించి నాకేమీ సంబంధంలేదు.
పూజా, వరుణ్ నటన గురించి!
పూజా పాత్ర ఆమె ఎపిసోడ్ కొంచెం సస్పెన్స్ అండి. ఆమె సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆమెతో ఒక పాట, కొన్ని సన్నివేశాలు కాన్సెప్ట్ లో భాగంగా ఉంటాయి. కథలో భాగంగా ఉండాలనే శ్రీదేవి,శోభన్ బాబుల సాంగ్ తీసుకోవడం జరిగింది. వరుణ్ ఫ్యాన్స్ ‘వాల్మికీ’లో ఆయన నట విశ్వరూపం చూస్తారు. నేను అనుకున్నదానికి, రాసుకున్నదానికి మించి అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో తెలియదు కానీ, మా ఇద్దరి కాంబినేషన్ లో బెస్ట్ మూవీ గా మిగిలిపోతుంది.
విలన్ పాత్రపై..!
సిద్ధార్ద్ పాత్ర కోసం తెలుగులో కూడా చాలా మంది యంగ్ స్టర్స్ ఉన్నారు. కానీ వారికి గత చిత్రాల వలన ఏదో ఒక ఇమేజ్ అనేది ఉంటుంది. అలా ఉంటే కొన్ని సన్నివేశాలకు వారు సెట్ అవ్వరు అనే భావనతో తెలుగు వారికి అంతగా పరిచయం లేని అధర్వను తీసుకోవడం జరిగింది’ అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం వివాదల్లో మునిగి తేలుతున్న ఈ చిత్రం ఏ మాత్రం థియేటర్లలోకి వస్తందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout