Harish Shankar: ‘ఏటీఎం’ క్రెడిట్ అంతా దర్శకుడు చంద్ర మోహన్‌కు దక్కాలి.. హరీష్ శంకర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో స్టార్ ఫిల్మ్ డైరక్టర్ హరీష్‌శంకర్‌కి సెపరేట్ గుర్తింపు ఉంది. సినిమాలను డైరెక్ట్ చేయటంతో పాటు ఆయన తన రూట్‌ను మార్చారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5తో కలిశారు హరీష్ శంకర్. ఆయనకు సపోర్ట్‌గా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కూడా జాయిన్ అయ్యారు. వీరిద్దరూ కలిసి `ఏటీఎం` అనే వెబ్ సీరీస్‌ని రూపొందించారు. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, కృష్ణ, రవిరాజ్, రాయల్ శ్రీ, దివి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సి.చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. జనవరి 20న రాబోతోన్న ఈ `ఏటీఎం` ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు.
ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ...
దర్శకుడు చంద్ర మోహన్ మాట్లాడుతూ.. 'ఈ కథను నాకు ఇచ్చి చేయమని చెప్పిన హరీష్ శంకర్ గారికి థాంక్స్. దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో సినిమా చేయాలని ఎంతో మంది కలలు కంటారు. నాకు ఈ ప్రాజెక్ట్‌తో అవకాశం దొరికింది. నా టీం ఎంతో సహకరించింది. మాస్ వైబ్ అనేది మ్యూజిక్,ఆర్ఆర్‌తో అర్థమవుతుంది. సుబ్బరాజు గారి పాత్ర, షఫీ గారి పాత్ర చాలా బాగుంటుంది. జీ5 టీంకు థాంక్స్. టీం అంతా కలిసి కష్టపడినందుకే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. హరీష్ శంకర్ గారు మా వెనకాల ఉన్నారనే ధైర్యంతోనే ముందుకు వెళ్లామ'ని అన్నారు.
నిర్మాత హన్షిత మాట్లాడుతూ.. 'హరీష్ శంకర్ గారు మా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు. ఆయన ఆలోచనల్లోంచే ఈ ఏటీఎం కథ పుట్టింది. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. నటీనటులంతా కూడా చక్కగా నటించారు. సుబ్బరాజు, సన్నీ అద్భుతంగా నటించారు. ఈ తరం ఆడియెన్స్ కోరుకునే ప్రాజెక్టులు తెరకెక్కించాలనే డీఆర్పీ (దిల్ రాజు ప్రొడక్షన్స్)ని ప్రారంభించామ'ని అన్నారు.
నిర్మాత హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఏటీఎం ప్రాజెక్ట్ హరీష్ శంకర్ అన్న వల్లే మొదలైంది. సుబ్బరాజు గారితో మాది ఎన్నో ఏళ్ల బంధం. ఈ సినిమాలో ఆయన నటించినందుకు థాంక్స్. ఏటీఎంలో నటించిన నలుగురు కుర్రాళ్లు అద్భుతంగా నటించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్' అని అన్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 'కరోనా కంటే ముందు ఈ కథను రాసుకున్నాను. కరోనాలో ఇంకా డెవలప్ చేశాను. ఓటీటీలకు రాస్తే క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. మంచి కంటెంట్‌ను జనాల ముందుకు తీసుకు రావడానికి ఫైనాన్షియల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తరువాత నాకు అనిపించింది. ఏటీఎం సినిమాకు ప్రశంసలు వస్తే.. అవన్నీ దర్శకుడు చంద్ర మోహన్‌కు మాత్రమే దక్కాలి. సినిమాను అద్భుతంగా తీశారు. బడ్జెట్ విషయంలో సహకరించిన జీ5 టీంకు థాంక్స్. హర్షిత్, హన్షితకు వెల్కమ్. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో తీయాలి. ఎస్వీసీలో డైరెక్షన్ చేయడం అనేది పెద్ద అచ్చీవ్‌వెంట్. చంద్ర మోహన్‌కు ఆ అవకాశం దక్కింది. రెమ్యూనరేషన్ విషయంలో సుబ్బరాజు సహకరించారు. నా ఫస్ట్ సినిమా షాక్‌లో సుబ్బరాజు చేశారు. ఇప్పుడు నా ఫస్ట్ ఓటీటీ సినిమాలోనూ సుబ్బరాజు నటించారు. షఫీ గారు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. దివి, అశ్విన చక్కగా నటించారు. ప్రశాంత్ ఆర్ విహారి గారు మంచి సంగీతాన్ని, ఆర్ఆర్‌ను ఇచ్చారు. జీ5 టీం మాకు ఎంతో సహకరించారు. మా కోసం ఎన్నో రూల్స్ బ్రేక్ చేశారు. వారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత క్వాలిటీగా వచ్చింది. రెండో సీజన్ కూడా రాబోతోంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఏటీఎంలో సన్నీ, రోయల్, రవి రాజ్, కృష్ణ నలుగురు పాత్రలు కాదు.. నాలుగు పిల్లర్స్. సన్నీకి పర్పెక్ట్ మాస్ హీరో అయ్యే అవకాశం ఉంది. అందరూ అద్భుతంగా నటించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జనవరి 20న జీ5లో రాబోతోంద' అని అన్నారు.
జీ 5 కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దేశ సాయితేజ్ మాట్లాడుతూ ‘‘‘ఏటీెఎం’ ఓ గేమ్ చేంజర్. తెలుగు ఓటీటీ రంగంలో ఇది కచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుందని చెప్పగలను. మాకు నమ్మకం ఉంది. 2003లో దిల్ రాజుగారు నిర్మాతగా దిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు 2023లో ఓటీటీలోకి ఏటీఎంతో అడుగు పెట్టారు. జనవరి 20న ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది. అప్పుడు దిల్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ఇప్పుడు ఓటీటీలో ఏటీఎం కూడా అదే రేంజ్‌లో హిట్ అవనుంది. ఈ సిరీస్‌కు అద్భుతమైన కథను అందించిన హరీష్‌గారికి, అంతే అద్భుతమైన కథను అందించిన చందుగారికి థాంక్స్. సన్నీ, కృష్ణ సహా మా నలుగురు హీరోలతో సహా సుబ్బరాజ్‌గారు, షఫీగారు, దివిగారికి థాంక్స్. ప్రతీ పండుగకు ఇక అందరూ జీ5 వైపు కంటెంట్ కోసం చూస్తారు. అంత గొప్ప కంటెంట్ రానుంది. ఈ ఏడాదిని ఏటీఎంతో ప్రారంభిస్తున్నాం. ప్రతి నెల ఓ కొత్త వెబ్ సిరీస్‌తో పాటు ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. అడ్డమైన బొమ్మల్లో సినిమాను చూడకండి. జీ 5లో సబ్ స్క్రిప్షన్ తీసుకోండి’’ అన్నారు.
హీరో సన్నీ మాట్లాడుతూ.. 'హరీష్ శంకర్ గారిని ఎప్పుడైనా ఆడియో లాంచ్‌లో చూసినప్పుడు పక్కన నిల్చుంటే చాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన రాసిన కథలో నేను జగన్ అనే పాత్రను పోషించాను. అలాంటి ఆయన రాసిన పాత్రకు వంద శాతం నేను ఇవ్వాలని అనుకున్నాను. లైఫ్ టైం నాకు గుర్తుండిపోయే పాత్ర. ఇది మాకు చాలా పెద్ద అవకాశం. నా ఫ్రెండ్స్ రోయల్, రవి రాజ్, కృష్ణ, దివిలకు థాంక్స్. సుబ్బరాజు అన్న పాత్ర చాలా బాగుంటుంది. హరీష్ అన్నకు థాంక్స్. నిర్మాత హర్షిత్, హన్షితలకు థాంక్స్. ఏటీఎం అనేది అద్భుతంగా ఉండబోతోంది. జీ5కి అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్' అని అన్నారు.
ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ.. 'ఇలాంటి కొత్త కథలకు మ్యూజిక్ చేయాలని అందరూ అనుకుంటారు. ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్' అని అన్నారు.
దివి మాట్లాడుతూ ‘‘నేను నా యాక్టింగ్‌ను మహర్షి సినిమాలో చిన్న రోల్‌తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏటీఎం సిరీస్‌లో యాక్ట్ చేశాను. చాలా గర్వంగా అనిపిస్తుంది. హరీష్‌గారికి, హర్షిత్‌గారికి, చందుగారికి, నా కోస్టార్స్‌కి థాంక్స్’’ అన్నారు.
షఫీ మాట్లాడుతూ ‘‘దిల్ రాజు ప్రొడక్షన్, హర్షిత్, హన్షిత సహా అందరికీ థాంక్స్. హరీష్ గారు బ్యూటీఫుల్ స్క్రిప్ట్ అందించారు. చందుగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హరీష్‌గారు ఇంత మంచి స్క్రిప్ట్ ఎలా రాశారో తెలియదు. నా పాత్ర నాకే కొత్తగా అనిపిస్తుంది. లైఫ్ ఫిలాసఫీని నా క్యారెక్టర్‌తో చక్కగా చెప్పించారు. నా డైలాగ్స్ మిమ్మల్ని హంట్ చేస్తాయి. అలాంటి క్యారెక్టర్స్‌ను ఇప్పుడే చూస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’’ అన్నారు.
సుబ్బరాజ్ మాట్లాడుతూ ‘‘ఈ సిరీస్‌తో నలుగురు జెమ్స్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. చంద్రమోహన్ కథ చెప్పినప్పుడు సాత్వికడని అర్థమైంది. కానీ.. షూటింగ్ సమయంలో తన వర్కింగ్ స్టైల్‌లో తెలిసిపోయింది. నేను కూడా పూర్తిగా సిరీస్ చూడలేదు. జనవరి 20న సిరీస్‌ను జీ 5లో చూస్తాను. హరీష్ నాకు ఫోన్ చేసి క్యారెక్టర్ చేయాలని చెప్పినప్పుడు రెగ్యులర్ రోల్ అనే అనుకున్నాను. కానీ.. కానీ సెట్స్‌లోకి అడుగు పెట్టిన తర్వాతే తెలిసింది. చందు నా క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా మలిచాడు. చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఆర్య సినిమా సమయంలో హర్షిత్, హన్షిత చిన్న పిల్లలు.. ఇప్పుడు వాళ్లు ప్రొడ్యూసర్స్ కావటం హ్యాపీ. హరీష్ సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.
నటీనటులు: జగన్‌గా వీజే సన్ని, హెగ్డేగా సుబ్బరాజ్, గజేంద్రగా పృథ్వీ, కార్తీక్‌గా కృష్ణ బూరుగుల, అభయ్‌గా రవిరాజ్, హర్షగా రాయల్ శ్రీ, రమ్యా నాయక్‌గా దివి, సీఐ ఉమాదేవిగా దివ్యవాణి, మెంటర్ పాత్రలో షఫీ, నీలోఫర్‌గా హర్షిణి నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments