నేషనల్ మీడియాపై హరీశ్ శంకర్ సెటైర్ !
- IndiaGlitz, [Saturday,September 26 2020]
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ నేషనల్ మీడియాపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇంతకూ హరీశ్ శంకర్‌కు జాతీయ మీడియాపై ఎందుకు కోపం వచ్చింది? అనే విషయంలోకి వెళితే.. గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. బాలుపై దక్షిణాది మీడియా ప్రత్యేక కథనాలెన్నింటినో ప్రసారం చేసింది. అంతర్జాతీయ టీవీ ఛానెల్ బీబీసీ ఛానెల్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గొప్పతనం గురించి న్యూస్‌ను ప్రెజెంట్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడి.. ఎస్పీబీకి ట్విట్టర్ వేదికగా నివాళులు అందించారు. ఈ విషయాన్ని బీబీసీ ప్రస్తావిస్తూ న్యూస్‌ను టెలికాస్ట్ చేసింది. కానీ నేషనల్ మీడియా మాత్రం పట్టించుకోలేదు.
దీనిపై హరీశ్ శంకర్‌కి కోపం వచ్చింది. తన కోపాన్ని మాటల రూపంలో వ్యక్తం చేస్తూ .. ‘‘ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..ఇరుకు సందుల్లో కాదు..’’ అంటూ బీబీసీ ఛానెల్లో బాలు గురించి ప్రసారమైన వార్తకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.