దువ్వాడ సీక్రెట్ ని బయట పెట్టిన హరీష్ శంకర్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే డ్యాన్సులు, ఫైట్స్‌కు ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్ని చేసిన సినిమా `డీజే దువ్వాడ జగన్నాథమ్` జూన్ 23న విడుదల కానుంది. బన్ని ఈ సినిమాలో రెండు షేడ్స్‌లో కనపడతాడు. ట్రైలర్ చూస్తుంటే పక్కా మాస్ ఫైట్స్ ఉంటాయనుకునేవారికి క్లైమాక్స్‌లో ఫైట్ లేదని షాకిచ్చాడు దర్శకుడు హరీష్ .
అదేంటంటే ప్రీ క్లైమాక్స్‌లోనే భారీ ఫైట్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ క్లైమాక్స్‌లో ఫైట్ ఎందుకు అని ఆలోచించి, క్లైమాక్స్‌ను ఎంటర్టైనింగ్గా చేద్దామని బన్ని, హరీష్‌ని కోరాట్ట. హరీష్ కూడా బన్ని ఆలోచన బావుందని, ఎంటర్టైనింగ్ వేలో క్లైమాక్స్‌ను తెరకెక్కించాడట. ఈ విషయాన్ని హరీష్ చెప్పేశాడు. ఓ రకంగా దువ్వాడలోని ఓ సీక్రెట్‌ను హరీష్ బయటపెట్టేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com