పవన్ 28...డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన హరీశ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రెండో చిత్రం ప్రారంభం కానుంది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ఈసారి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు’ అనే క్యాప్షన్ కూడా ఉంది. ఈ ప్రీ లుక్‌లో బైక్‌తో పాటు పెద్ద బాలశిక్ష కూడా ఉంది. గులాబీ పువ్వు కూడా ఉంది. బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్ ఫొటోలు కూడా ఉన్నాయి.
గబ్బర్‌సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో పదేళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రమిది. పవన్ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా నటింప చేయాలని అనుకుంటున్నారట. ఇది వరకు హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన డీజే దువ్వాడ జగన్నాథ్, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అదే ర్యాపోతో మరోసారి పూజాను నటింప చేయడానికి హరీశ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా మహేశ్, అల్లు అర్జున్, చరణ్ సహా వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే నటించారు. మరిప్పుడు పవన్‌తో నటించడానికి పూజాహెగ్డే ఒప్పుకుంటారో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com