Harish Shankar: 'ఉస్తాద్ భగత్‌సింగ్' ఐదు రోజులే షూటింగ్ చేశాం.. హరీష్ కామెంట్స్..

  • IndiaGlitz, [Wednesday,March 13 2024]

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన కటిమ్ అయిన సినిమాల షూటింగ్ వాయిదాపడింది. ఇందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా ఉంది. హరీష్‌ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. గబ్బర్ సింగ్ లాంటి హిట్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ‘ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది’ అంటూ విడుదల చేసిన గ్లింప్స్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. దీంతో మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమని ఫిక్స్ అయ్యారు

అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఆపేశారు. దీంతో హరీష్‌ శంకర్.. మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా తీస్తున్నాడు. ఎన్నికలు అయిపోగానే పవన్ ఫ్రీ అవుతారు కాబట్టి అప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ను పట్టాలెక్కిస్తారట. ఈలోపు రవితేజ సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ చెప్పాడు హరీష్‌.

నేను షూట్ చేసింది కేవలం ఐదు రోజులు మాత్రమే. ఆ ఐదు రోజులు ఫుటేజ్‌నే టీజర్‌గా కట్ చేశాము. 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సెట్స్‌లో ఏ వైబ్ అయితే కనిపించేదో.. ఇప్పుడు ఉస్తాద్ మూవీ సెట్స్‌లో కూడా అదే వైబ్ మాకు కనిపించింది. సినిమా ఎలా ఉంటుందో నేను సినిమాతోనే చూపిస్తాను అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ సినిమా మరో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తు్న్నారు.

ఇక పవన్ కల్యాణ్‌ సినిమాల విషయానికొస్తే గతేడాది మెగా మేనల్లుడు సాయితేజుతో కలిసి 'బ్రో' సినిమాలో నటించాడు. ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. అలాగే సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ 'హరిహర వీరమల్లు' చిత్రంలోనూ నటించాడు. ఈ మూవీలన్ని వచ్చే ఏడాది లోపు విడుదల కానుది.

More News

Electoral bonds: 22,217 ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాలు.. సుప్రీంకోర్టులో SBI అఫిడవిట్..

ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు దెబ్బకి ఎట్టకేలకు SBI దొగొచ్చింది. న్యాయస్థానం చెప్పిన గడువులోగా బాండ్స్ వివరాలు సమర్పించింది. ఈ మేరకు కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

Mudragada: వైసీపీలోకి ముద్రగడ చేరిక వాయిదా.. ఎందుకంటే..?

కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వాయిదాపడింది. గురువారం తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

YS Jagan: ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం జగన్

ఏపీలో ఎన్నికల సమరానికి సమయం సిద్ధమైంది. మరో రెండు రోజల్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార వైసీపీ కురుక్షేత్రానికి సిద్ధమైంది. ఈనెల 16న పార్టీ అభ్యర్థుల తుది జాబితాను

చిలకలూరిపేట సభకు భూమి పూజ.. పాల్గొన్న టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు..

ఈనెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సంయుక్తంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభా ప్రాంగణానికి భూమి పూజ చేశారు.

వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి మార్పు.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ..

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌లకు TG ప్రిఫిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత నోటిఫికేషన్‌లోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి గతంలో