Harish Shankar: 'ఉస్తాద్ భగత్‌సింగ్' ఐదు రోజులే షూటింగ్ చేశాం.. హరీష్ కామెంట్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన కటిమ్ అయిన సినిమాల షూటింగ్ వాయిదాపడింది. ఇందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. గబ్బర్ సింగ్ లాంటి హిట్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ‘ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది’ అంటూ విడుదల చేసిన గ్లింప్స్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. దీంతో మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమని ఫిక్స్ అయ్యారు
అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఆపేశారు. దీంతో హరీష్ శంకర్.. మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా తీస్తున్నాడు. ఎన్నికలు అయిపోగానే పవన్ ఫ్రీ అవుతారు కాబట్టి అప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ను పట్టాలెక్కిస్తారట. ఈలోపు రవితేజ సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ చెప్పాడు హరీష్.
"నేను షూట్ చేసింది కేవలం ఐదు రోజులు మాత్రమే. ఆ ఐదు రోజులు ఫుటేజ్‌నే టీజర్‌గా కట్ చేశాము. 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సెట్స్‌లో ఏ వైబ్ అయితే కనిపించేదో.. ఇప్పుడు ఉస్తాద్ మూవీ సెట్స్‌లో కూడా అదే వైబ్ మాకు కనిపించింది. సినిమా ఎలా ఉంటుందో నేను సినిమాతోనే చూపిస్తాను" అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ సినిమా మరో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తు్న్నారు.
ఇక పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే గతేడాది మెగా మేనల్లుడు సాయితేజుతో కలిసి 'బ్రో' సినిమాలో నటించాడు. ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. అలాగే సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ 'హరిహర వీరమల్లు' చిత్రంలోనూ నటించాడు. ఈ మూవీలన్ని వచ్చే ఏడాది లోపు విడుదల కానుది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout