ఈసారి మ‌ల్టీస్టార‌ర్‌ తో

  • IndiaGlitz, [Tuesday,November 21 2017]

గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత హారీష్ శంక‌ర్ పేరు మారు మోగింది. అయితే రామ‌య్యా వ‌స్తావ‌య్య ప్లాప్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ స‌క్సెస్‌లు ఆ స్థాయి పేరుని హరీష్‌కి తెచ్చి పెట్ట‌లేదు. అయితే అల్లు అర్జున్‌తో 'డిజె దువ్వాడ జగన్నాథమ్' చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుక‌న్నా, క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింద‌ని నిర్మాత‌లు చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం హరీష్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా వున్నారు.

ఆయన రెడీ చేస్తున్న సబ్జెక్ట్స్‌లో ఓ మల్టీస్టారర్ కథ కూడా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నటించే అవకాశం వుందట. అందుకోసం నితిన్, శర్వానంద్‌లను హరీష్ శంకర్ కలిసినట్టు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు హరీష్‌తో సినిమా చేయుడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్‌కి తుదివెురుగులు దిద్దుతున్నారట.

అయితే ఈ మల్టీస్టారర్‌కి సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి వుంది. మ‌రి తుదిగా ఈ మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలెక్కుతుందంటారా..ఏమో చూద్దాం..