పవన్‌తో హరీష్ శంకర్ భేటీ.. ముహూర్తం సెట్ అయినట్టే..!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశంకర్ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ‘గబ్బర్‌సింగ్’ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా వచ్చింది లేదు. అయితే సోషల్ మీడియాలో హరీష్ శంకర్‌కు అభిమానుల ఎదురయ్యే తొలి ప్రశ్న.. పవన్‌తో ఎప్పుడు సినిమా చెయ్యబోతున్నారు? అని. తాజాగా వీరిద్దరి కాంబోలో సినిమాపై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. నేడు హరీష్ శంకర్‌తో పవన్ భేటీ అవడం ఆసక్తికరంగా మారింది.
మూడేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా `వకీల్ సాబ్` సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఆ తరువాత మరో రెండు సినిమాలను ఏకకాలంలో పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో డైరెక్టర్ క్రిష్ సినిమాతో పాటే... `అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్‌లో కూడా ఏకకాలంలో పాల్గొంటారని టాక్ నడుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీస్‌కు ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా నిమిత్తం డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఆయనతో చాలా సేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘మన పవర్ స్టార్‌తో సుదీర్ఘమైన, ఒక ప్రొడక్టివ్ సమావేశం జరిగింది. ఇదేదో కేవలం సరదా కోసం జరిగిన మీటింగ్ కాదు.. భారీ ప్రాజెక్టుకు ఆరంభం’’ అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. వేసవి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వస్తానని పవన్ మాటిచ్చినట్టు తెలుస్తోంది. 2022 వేసవి టార్గెట్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com