డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన 'బ్రాండ్ బాబు' టీజర్!

  • IndiaGlitz, [Tuesday,July 10 2018]

మారుతి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాక‌ర్.పి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.శైలేంద్ర‌బాబు నిర్మిస్తోన్న చిత్రం 'బ్రాండ్ బాబు'. సుమ‌త్ శైలేంద్ర‌, ఈషా రెబ్బా, పూజిత వ‌న్నోడ, ముర‌ళీశ‌ర్మ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌.ఎస్ సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా...డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... నేను తొలిసారి పూర్తిగా మాట‌లు, స్క్రిప్ట్ అందించిన సినిమా ఇది. కొన్ని సినిమాల‌కు కాన్సెప్ట్‌లు ఇస్తుంటాను. కానీ ఈ సినిమాకు బౌండెడ్ స్క్రిప్ట్ రాసి..పూర్తిగా శైలేంద్ర‌బాబుగారికి నెరేట్ చేశాను. స్ర్కిప్ట్ విన్న ఆయ‌న ట్రెండ్‌లో ఉన్న పాయింట్.. అంద‌రూ క‌నెక్ట్ అవుతార‌నిపించింది. 'డైరెక్ట‌ర్ మీలాగా తీయ‌గ‌లుగుతారా?' అని ఆయ‌న ప్ర‌శ్నించారు. చాలా మందిని అనుకున్నాను కానీ.. ఎందుకో ప్ర‌భాక‌ర్‌గారే క‌రెక్ట్ అనిపించింది. ఒక సినిమా ఫెయిల్ అయితే క‌థ పెయిల్ అయిన‌ట్లే త‌ప్ప‌.. టెక్నీషియ‌న్ ఫెయిల్ అయిన‌ట్లు కాద‌ని నేను న‌మ్ముతాను.

ఫెయిల్యూర్‌కి, టెక్నీషియ‌న్‌కి లింకు పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని నిర్మాత‌లు కొన్ని సందేహాలు వెలిబుచ్చినా.. నేను వారికి స‌మాధానం చెప్పాను. ప్ర‌భాక‌ర్‌గారు స్క్రిప్ట్ విని ఓకే చెప్ప‌గానే.. సినిమా స్టార్ట్ అయ్యింది. నేను ఏదైతే అనుకున్నానో.. దాన్ని ఎగ్జాట్‌గా తెర‌పై చూపించారు.

ఈ సినిమాను అంద‌రూ ప్రేమించి చేశారు. సినిమాను చూసుకున్నాం. చాలా బావుంది. ఈ సినిమా ఇంత రిచ్‌గా రావ‌డానికి నిర్మాత‌గారే కార‌ణం. జీవ‌న్ సాంగ్స్‌, ఆర్‌.ఆర్ విష‌యంలో చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. డెఫ‌నెట్‌గా ఇది స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను ఆగష్టు మొదటివారంలో సినిమా విడుదల కానుందన అన్నారు.

డైరెక్టర్ హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ... మారుతి ఇంత‌కు ముందు చాలా సార్లు త‌న ఫంక్ష‌న్ల‌కు పిలిచాడు. కానీ రాలేక‌పోయాను. కానీ ఈ సినిమాకు రాక‌పోతే ఇంకోసారి పిల‌వ‌న‌న్నాడు. నాకు చాలా థాట్స్ ఉంటాయి. కానీ నేను రాయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ మారుతి చాలా సింపుల్‌గా క‌థ రాస్తాడు. అందుకే నాకు త‌నంటే విప‌రీత‌మైన గౌర‌వం.

మారుతి తొలి సినిమా స‌క్సెస్ కాగానే, త‌న చుట్టుప‌క్క‌నున్న వారి స‌క్సెస్ గురించి ఆలోచించాడు. మారుతి మ‌ల్టీటాస్కింగ్ ప‌ర్స‌న్‌. ప్ర‌భాక‌ర్‌గారు ఎప్పుడూ బిజీ ప‌ర్స‌న్‌. సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. 'నెక్స్ట్ నువ్వే' సినిమాతో మంచి టెక్నీషియ‌న్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. మ‌నం చేయాల‌నుకున్న ప‌ని చేయ‌డ‌మే స‌క్సెస్‌. అది న‌లుగురికీ న‌చ్చ‌డం బోన‌స్‌. హీరో చాలా బాగా చేశాడు అని అన్నారు.

డైరెక్టర్ ప్ర‌భాక‌ర్.పి మాట్లాడుతూ... నేను డైరెక్ట‌ర్ అవుదామ‌నుకున్న‌ప్పుడు అర‌వింద్‌గారు, జ్ఞాన‌వేల్‌రాజ‌గారు, యువీ క్రియేషన్స్ వంశీగారు, బ‌న్ని వాసుగారు ఓ కొత్త బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి అవ‌కాశం ఇచ్చారు. వారికి నేనెంత‌గా రుణ‌ప‌డి ఉంటానో.. అంత‌కు కాస్త ఎక్కువ‌గానే మారుతిగారికి రుణ‌ప‌డి ఉంటాను. సినిమా స‌క్సెస్ అయితే ఎవ‌రైనా అవ‌కాశం ఇస్తారు. అంతంత మాత్ర‌మే ఆడిన నా సినిమా చూసి నువ్వు బాగానే డైరెక్ట్ చేశావ్ అని మారుతిగారు మెచ్చుకుని నాకు డైరెక్ష‌న్ చాన్స్ ఇచ్చారు.

మారుతిగారు స‌క్సెస్ అయిన తొలి రోజు నుండి కొత్త వారికి అవ‌కాశం ఇస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న గొప్ప స్థాయికి రావాలి. నేను స‌క్సెస్ అయ్యాన‌ని మ‌న‌స్ఫూర్తిగా న‌మ్ముతున్నాను. మారుతిగారు రాసిన స్క్రిప్ట్‌ను డీల్ చేసి.. నేను ఎలా తీస్తానో అలాగే తీసావ‌య్యా అనిపించుకున్న త‌ర్వాత నాలో న‌మ్మ‌కం పెరిగింది.

ఆయ‌నకి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. మా నిర్మాత శైలేంద్ర‌గారికి డ‌బ్బులు గురించి టెన్ష‌న్ లేదు కానీ.. సినిమా బాగా రావాల‌ని ఎప్పుడూ చెబుతుండేవారు. జెబి భ‌విష్య‌త్‌లో పెద్ద మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడు. అద్భుతమైన పాట‌లే కాదు.. రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు. కార్తీక్ ప‌ళ‌ని ఎక్స్‌ట్రార్డిన‌రీ విజువ‌ల్స్ ఇచ్చారు. ఈషాగారు చ‌క్క‌గా న‌టించారన‌డం కంటే జీవించార‌నే చెప్పాలి. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌ అన్నారు.

హీరో సుమంత్ శైలేంద్ర మాట్లాడుతూ... నేను స్క్రిప్ట్ విని ప్రేమ‌లో ప‌డ్డాను. ఇది ప‌క్కా మారుతి సినిమా. ఈ సినిమాలో ప్ర‌తి పాత్రా ఎలివేట్ అవుతుంది. తండ్రీ కొడుకుల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా బావుంటాయి. 50 శాతం స్క్రిప్ట అయితే, 50 శాతం ప్ర‌భాక‌ర్‌గారి కృషి అని చెప్పాలి. ప్ర‌భాక‌ర్ గారు ప్ర‌తి యాక్ట‌ర్‌కీ ఎలా న‌టించాలో నేర్పించారు. ఆయ‌న‌కు మెమ‌రీ చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

ప్ర‌భాక‌ర్‌గారి డైర‌క్ష‌న్‌ని చాలా ఇష్ట‌ప‌డ్డాను. ఈషా చాలా బాగా న‌టించారు. చాలా మైన్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. పూజిత చాలా బాగా న‌టించారు. జె.బి.గారు చాలా మంచి పాట‌లు ఇచ్చారు. అన్నీ ర‌కాల పాట‌లూ ఉన్నాయి. జె.బి.గారు రీరికార్డింగ్‌లో రాక్‌స్టార్‌. ఈ సినిమాకు కూడా చాలా బాగా ఆర్‌.ఆర్‌. చేశారు. ఈ సినిమా రామ్ కామ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉంటాయి అని అన్నారు.

నిర్మాత ఎస్.శైలేంద్ర‌బాబు మాట్లాడుతూ... మారుతిగారి స్క్రిప్ట్ చాలా బావుంది. మారుతిగారే ప్ర‌భాక‌ర్‌ని డైరెక్ట‌ర్‌గా సెల‌క్ట్ చేశారు. ఆయ‌న ఎలా చెప్పారో.. అలాగే తీశారు. సినిమా అవుట్‌పుట్ చ‌క్క‌గా వ‌చ్చింది. ఇది నా 18వ సినిమా. సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు త‌ర్వాత తెలుగులో నేను నిర్మించిన చిత్ర‌మిది. దీని ద్వారా నా త‌న‌యుడు సుమంత్‌శైలేంద్రను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాను. టీజ‌ర్ లాంచ్ చేసిన హరీశ్ శంక‌ర్‌గారికి థాంక్స్‌ అన్నారు.

పూజిత వ‌న్నోడ మాట్లాడుతూ... డైరెక్ట‌ర్ ప్ర‌భాక‌ర్‌గారికి, నిర్మాత శైలేంద్ర‌గారికి, మారుతిగారికి థాంక్స్‌. సుమంత్ శైలేంద్ర చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

ఇషారెబ్బా మాట్లాడుతూ... ఫ‌స్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్‌కూడా చాలా బాగా న‌చ్చింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మేమంత చాలా బాగా న‌టించాం. సుమంత్ శైలేంద్ర హార్డ్‌వ‌ర్కింగ్ కోస్టార్‌. త‌న‌కు టాలీవుడ్‌లోకి వెల్‌క‌మ్ చెబుతున్నాం. స్క్రిప్ట్ విన‌గానే.. నిజ జీవితంలో ఎక్క‌డో చూశామ‌నిపించి క‌నెక్ట్ అయ్యింది. రేపు సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు కూడా అలాగే క‌నెక్ట్ అవుతుంది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, మారుతిగారికి థాంక్స్‌ అన్నారు.

రాజా ర‌వీంద్ర మాట్లాడుతూ... మారుతిగారికి, శైలేంద్ర‌బాబు, సుమంత్ శైలేంద్ర స‌హా ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

పూర్ణాచారి మాట్లాడుతూ...కొత్త టాలెంట్‌ను క‌నిపెట్టి అవ‌కాశాలు ఇవ్వ‌డంలో మారుతిగారు ఎప్పుడూ ముందుంటారు. ఇది వ‌ర‌కు నాకు కూడా ఆయ‌న అవ‌కాశం ఇచ్చారు అన్నారు.