'దాగుడు మూతలు' ఆగిపోయినట్టేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆగిపోయిన మల్టీస్టారర్ సినిమాలకు శ్రీకారం చుట్టిన నిర్మాత దిల్‌రాజు సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో మల్టీస్టారర్‌కు తెర తీసిన దిల్‌రాజు ఈ ఏడాది రెండు మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో 'ఎప్2'.. కాగా మరొకటి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది.
అయితే అంత కంటే ముందుగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడు మూతలు' అనే మల్టీస్టారర్ ప్లాన్ చేశారు దిల్‌రాజు. ఇందులో నితిన్, శర్వానంద్ హీరోలుగా నటిస్తారని కూడా తెలిసింది. అయితే.. ఈ మల్టీస్టారర్‌కు ఆగిపోయినట్లేనని ఇండస్ట్రీ వర్గాల టాక్. దిల్‌రాజుకి స్క్రిప్ట్ నచ్చడం లేదు.
దాంతో సినిమాను పక్కన పెట్టేశాడట. ఇప్పుడు హరీశ్ శంకర్ మరో నిర్మాతతో ఈ మల్టీస్టారర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్ని కుదిరితే ఓకే.. లేకుంటే మరో కొత్త ప్రాజెక్ట్‌తో హరీశ్ శంకర్ సినిమా చేస్తాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com