విజయ్ దేవరకొండ పై హరీష్ శంకర్ కామెంట్స్

  • IndiaGlitz, [Tuesday,September 24 2019]

డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ రీసెంట్‌గా విడుద‌లైన 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌'తో పెద్ద విజ‌యాన్నిసొంతం చేసుకున్నాడు. ఈ విజ‌యం హ‌రీశ్‌లో ఓ మేర కాన్ఫిడెంట్‌ను పెంచింద‌నే చెప్పాలి. వ‌రుణ్‌తేజ్‌కు ఈ ఏడాది సెకండ్ హిట్‌. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ బాగానే ఉన్నాయి. తాజాగా డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌స్తావ‌న వ‌స్తే కొన్ని విష‌యాల‌ను చెప్పాడు. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండతో సినిమా చే్యాల‌ని హ‌రీశ్ శంక‌ర్ అత‌న్ని వెళ్లి క‌ల‌వ‌గా, రెండేళ్ల వ‌ర‌కు ఖాళీ లేద‌ని, త‌ర్వాత చూద్దామ‌ని చెప్పేశాడ‌ట‌. అంటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో హ‌రీశ్ ప్ర‌య‌త్న‌మైతే చేశాడు కానీ ఫ‌లించ‌లేదు. అయితే ఈ ఇంట‌ర్వ్య‌లోనే హ‌రీశ్ మాట్లాడుతూ విజ‌య్ దేవ‌ర‌కొండ నెగెటివ్‌పై ఎక్కువ‌గా స్పందిస్తాడ‌ని, అలా కాకుండా కూల్‌గా ఉంటే బెస్ట్ అని స‌ల‌హా ఇచ్చాడు. మ‌రి హ‌రీశ్ శంక‌ర్ స‌ల‌హాను విజ‌య్ దేవ‌ర‌కొండ వింటాడో లేదో చూడాలి.

అయితే ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే హ‌రీశ్ శంక‌ర్‌ను ప‌క్క‌న పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌దుప‌రి సినిమాను పూరితో చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. నిజానికి ముందు ఇస్మార్ట్ శంక‌ర్‌ను కూడా విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో పూరి చేయాల‌నుకున్నాడ‌ని, త‌న‌ను కాదంటేనే రామ్‌తో చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడ‌ని ఇండ‌స్ట్రీలో ఓ టాక్ ఉంది. అయితే హిట్ త‌ర్వాతే పూరితో ప‌ని చేయ‌డానికి విజ‌య్ దేవ‌కొండ ఆస‌క్తిని చూపాడు. ప్ర‌స్తుతం పూరి, ఈ హీరో కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడు.

More News

కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం

టాలీవుడ్‌లో ఒకప్పుడు హాస్యం అంటే టక్కున గుర్తొచ్చే వారిలో వేణుమాధవ్ ఒకరు. ఒకట్రెండు కాదు..

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సాంగ్ వచ్చేసిందోచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

'గద్దలకొండ గణేష్' ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఎస్ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన 'గద్దలకొండగణేష్‌'

రేవంత్‌కు ఊహించని షాకిచ్చిన కాంగ్రెస్!!

భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఊహించని షాకిచ్చిందా..?

‘2.0 పూర్తయ్యేనాటికి నా రాజకీయ జీవితం ముగుస్తుంది’

బీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల పరిస్థితి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా ఉంది.