రీమేక్ సినిమా చేయడం లేదు: హరీశ్ శంకర్
Send us your feedback to audioarticles@vaarta.com
కమర్షియల్ సినిమాల మీటర్ బాగా తెలిసిన నేటి తరం దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకడు. జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2012లో విడుదలైంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా రీమేక్ అని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై హరీశ్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. తాను పవన్‌తో స్ట్రయిట్ సినిమానే చేస్తున్నానని, రీమేక్ సినిమా చేయడం లేదని అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు హరీశ్ శంకర్.
షాక్ సినిమాతో దర్శకుడిగా షాక్ తిన్న హరీశ్ శంకర్ తర్వాత మిరపరకాయ్, గబ్బర్ సింగ్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. రామయ్యా వస్తావయ్యా సినిమాతో మళ్లీ డిజాస్టర్‌ను ఎదురుచూశాడు. తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే దువ్వాడ జగన్నాథమ్, గద్దలకొండ గణేష్ చిత్రాలతో విజయాలను దక్కించుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన ఫేవరేట్ హీరో పవన్ కల్యాణ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈసారి పవన్‌కల్యాణ్‌ను హరీశ్ ఎలా చూపించబోతున్నాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com