PSPK28: అలెర్ట్ అయిన టీమ్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
Send us your feedback to audioarticles@vaarta.com
వకీల్ సాబ్ చిత్రంతో పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఘనంగా జరిగింది. మునుపటిలాగే పవన్ వకీల్ సాబ్ లో పవర్ ఫుల్ గా కనిపించాడు. దీనితో పవన్ తదుపరి చిత్రాలపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అయ్యప్పన్ కోషియం రీమేక్, హరిహర వీరమల్లు చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు.
ఇదీ చదవండి: అందాలన్నీ చూపిస్తూ కొంటెగా సాకు చెప్పిన హెబ్బా పటేల్
ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో PSPK28 షూటింగ్ ప్రారంభమవుతుంది. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ కాంబినేషన్ ఇది. గబ్బర్ సింగ్ రిజల్ట్ కళ్ళముందు ఉండడంతో అభిమానులు ఆగలేకపోతున్నారు. దీనితో PSPK28 హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, టైటిల్ పోస్టర్స్ తో రచ్చ చేస్తున్నారు.
వాస్తవానికి చిత్ర యూనిట్ ఇంతవరకు టైటిల్ ప్రకటించలేదు. కానీ PSPK28 టైటిల్ ఇదే అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో చిత్ర యూనిట్ అలెర్ట్ అయింది. దర్శకుడు హరీష్ శంకర్ తో సహా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.
'వాస్తవానికి PSPK28 ఫస్ట్ లుక్, టైటిల్ ఉగాదికే విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో మీరు ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ముచ్చటగా ఉన్నాయి. కానీ ఈ చిత్రాన్ని సంబంధించిన అధికారిక సమాచారం ఏదైనా మా సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే ప్రకటిస్తాం' అని మైత్రి సంస్థ క్లారిటీ ఇచ్చింది.
దీనికి కొనసాగింపుగా హరీష్ కూడా స్పందించారు. ' దయచేసి టైటిల్ గురించి అసత్యాలు ప్రచారం చేయకండి. అసలైన టైటిల్ మిమ్మల్ని మెప్పించే విధంగా ఉంటుంది. మీకన్నా ఎక్కువ ఆతృతగా నేను ఎదురుచూస్తున్నా' అని హరీష్ శంకర్ అన్నారు.
గబ్బర్ సింగ్ తర్వాత హరీష్, పవన్, దేవిశ్రీ ముగ్గురి కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments