అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం 'డి.జె...దువ్వాడ జగన్నాథమ్'

  • IndiaGlitz, [Sunday,August 28 2016]

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం 'డి.జె....దువ్వాడ జగన్నాథమ్' సినిమా రూపొందనుంది. ఆర్య, పరుగు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్న మూడో చిత్రమిది. అంతే కాకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న 25వ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

బన్నితో ఆర్య, ఆర్య2, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సహా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఆర్య, బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తో రూపొందనున్న డి.జె....దువ్వాడ జగన్నాథమ్' చిత్రం రేపు (ఆగస్ట్ 29) హైదరాబాద్ హదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఉదయం 7గంటల 15 నిమిషాలకు లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

More News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'లక్ష్మీ బాంబ్'

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌,

ఒక్కొక్కరు ఒక్కో కోణంలో వార్తలు చూపిస్తున్నారు తప్ప వాస్తవం చూపించడం లేదు - టి.ఆర్.ఎస్ ఎం.పి కవిత

ఆర్పీ పట్నాయక్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం మనలో ఒకడు.విభిన్న కథాంశంలో రూపొందిన ఈ చిత్రంలో నువ్వు నేను ఫేమ్ అనితా

3 పద్దతుల్లో జనసేన పోరాటం..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం చేయనున్న పోరాటం గురించి తెలియ చేస్తూ....

సర్ధార్ సరిగా చూడలేదు ఈసారి గట్టిగా చూడండి - పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సభలో ఆవేశంగా రాజకీయాల గురించే కాదు...సరదాగా సినిమాలగురించి కూడా మాట్లాడి నవ్వించారు.

సినిమాను కాదు నిజ జీవితాన్ని సీరియస్ గా తీసుకోండి - పవన్..!

మరణించిన అభిమాని వినోద్ మరణం గురించి పవన్ మాట్లాడుతూ....సినిమాని వినోదంగానే చూడండి.