హరీషన్న స్పందించి యశోదాలో బెడ్ ఇప్పించారు: జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి హరీష్‌రావును ప్రజల మనిషి అని అంతా భావిస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో ఆయన చూపిన శ్రద్ధ, చొరవ ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. తాజాగా సిద్ది శ్రీనివాసరెడ్డి అనే జర్నలిస్ట్ విషయంలో ఆయన చూపిన శ్రద్ధ మరోసారి వార్తల్లో నిలిపింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. చాలా ప్రాబ్లమ్ అవుతోందని.. తనకు అపోలోలో బెడ్ ఇప్పించమని జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి.. హరీష్‌రావును వేడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
వీడియోను చూసిన హరీష్‌రావు వెంటనే పలు ఆసపత్రుల్లో వాకబు చేసి.. సికింద్రాబాద్‌లోని యశోదాలో బెడ్ ఉందని తెలియడంతో వెంటనే శ్రీనివాసరెడ్డిని అక్కడికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు రెండు మూడు గంటలకోసారి ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను వాకబు చేస్తూ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ విషయాలన్నింటినీ వెల్లడిస్తూ శ్రీనివాస్ మరో వీడియో చేశారు. అయితే తను మొదట పోస్ట్ చేసిన వీడియోను కొందరు రాజకీయం చేశారని.. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు వద్దని మంచి ఎవరు చేసినా అంగీకరించాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్న హరీష్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments