Revanth Reddy:హరీష్‌రావు రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లో లేదు.. రేవంత్ రెడ్డి సెటైర్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్దకు రాజీనామా లేఖతో వచ్చిన మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజీనామా అంటున్న హరీష్‌రావు స్పీకర్ ఫార్మాట్లో లెటర్ రెడీ చేసుకోమని సవాల్ చేశారు. ప్రజలను మోసం చేయాలనుకునే ప్రతిసారీ హరీష్‌కు అమరవీరు స్థూపం గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అమరుల స్థూపం వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు.
తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని సెటైర్లు వేశారు. స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని హరీష్‌కు సూచించారు. హరీష్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారని.. ఆయన తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని విమర్శించారు. ఇప్పటికీ చెబుతున్నా నీ సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నాం. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. నీ రాజీనామా రెడీగా పెట్టుకో అన్నారు.
ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హరీష్ రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో లేదని.. అగ్గిపెట్టె నాటకం లాగా ఆయన ఇంకో నాటకానికి తెర లేపారని విమర్శించారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్‌రావు ఓ గుమాస్తా.. మాట్లాడాల్సింది ఆయన కాదని, కేసీఆర్ మాట్లాడాలన్నారు. రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? అని కోమటిరెడ్డి సవాల్ విసిరారు.
అంతకుముందు ఒకేసారి రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచే తప్పుకుంటానని హరీష్ సవాల్ చేశారు. అలాగే గన్‌పార్క్ వద్ద ప్రమాణం చేస్తానని... రేవంత్ కూడా రావాలని పిలుపునిచ్చారు. దీంతో హరీష్.. గన్ పార్క్ వద్దకు రాజీనామా పత్రంతో వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని అన్నారు. రేవంత్ రాలేని పక్షంలో తన సిబ్బందితోనైనా రాజీనామా పత్రాన్ని పంపించాలని సూచించారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో ప్రతి రైతుకి ఉన్న రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఛాలెంజ్ విసిరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments