మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా 'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Monday,February 27 2017]

ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నటించిన, నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18'. ఈ చిత్ర బిగ్‌ సీడీని తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు, జీవిత, ఎన్‌. శంకర్‌, మల్కాపురం శివకుమార్‌, చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌, దర్శకుడు నాని ఆచార్య, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ, చిత్ర కథానాయకుడు రాంకార్తీక్‌, బిత్తిరిసత్తి, కెమెరామెన్‌ జి.ఎల్‌. బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వర్యులు హరీష్‌రావు మాట్లాడుతూ.. 'రాజకీయాలలో పేరొందిన శివరాజ్‌ పాటిల్‌ ఈ చిత్రం ద్వారా సినీ రంగంలో కూడా మంచి పేరు పొందాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..' అన్నారు.

చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. మా చిత్ర ఆడియోని ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రాన్ని యూత్‌ని ఆట్టుకునే అంశంతో, ఒక చక్కని మెసేజ్‌తో దర్శకుడు నాని ఆచార్య తెరకెక్కించారు. ఘంటాడి కృష్ణ అందించిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము..అన్నారు.

సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. ఇది నా 50వ చిత్రం. సంగీత దర్శకుడిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ నాకు ఈ చిత్రంతో ప్రారంభం అవుతుందని, ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు..అని అన్నారు.

రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, రవిప్రకాష్‌, శివన్నారాయణ, బాబీలహరి, జబర్ధస్త్‌ కు చెందిన రఘు, రాము, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్‌చంద్ర మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్‌: మార్తాండ్‌. కె. వెంకటేష్‌, కెమెరా: జిఎల్‌.బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్‌ డిక్రూజ్‌, భాను, గణేష్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, పాటలు: కందికొండ, వరికుప్పల యాదగిరి, రామ్‌ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శివకుమార్‌, కో-డైరెక్టర్‌: జి. భూపతి, సమర్పణ: సాయితేజ పాటిల్‌, నిర్మాత: శివరాజ్‌ పాటిల్‌, స్టోరీ, డైరెక్షన్‌: నాని ఆచార్య.

More News

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' గుమ్మడికాయ వేడుక

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట`

5 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'డిజె దువ్వాడ జగన్నాథమ్ ' టీజర్

ఆర్య నుండి సరైనోడు వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్.

2017లో ఆస్కార్ విజేతలు

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఆస్కార్ అవార్డుల్లో 89వ వార్షికోత్సవ అవార్డుల ప్రధానోత్సవం డాల్బీ థియేటర్లో జరిగింది.ఇండియా నుండి ప్రియాంక చోప్రా ఈ వేడుక కు హాజరయ్యారు.

'విన్నర్ ' త్రీ డేస్ కలెక్షన్స్....

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో

చిరు 151వ సినిమాను కన్ ఫర్మ్ చేసిన శ్రీకాంత్...

ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.