రీమేక్ ఆలోచనలో హరీష్..
Send us your feedback to audioarticles@vaarta.com
`డీజే దువ్వాడ జగన్నాథమ్` చిత్రం తర్వాత డైరెక్టర్ హరీశ్ శంకర్ తదుపరి చిత్రంగా `దాగుడు మూతలు` సినిమా చేయాల్సింది. దిల్‌రాజు ఆ ప్రాజెక్ట్‌ను పెండింగ్‌లో పెట్టాడు. తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను వేరే బ్యానర్‌లో చేయడానికి ప్రయత్నాలు చేశాడు హరీశ్ శంకర్. ఎక్కడా వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు హరీశ్ శంకర్ తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం `జిగర్ తండా`ను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. బాబీ సింహ, సిద్ధార్థ్, లక్ష్మీమనన్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశాడు. ఆల్ రెడీ తెలుగులో సినిమా అనువాదమై విడులైంది కూడా. మళ్లీ ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు మరి. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com