పవన్‌ని హరీష్ కలవలేదట
Send us your feedback to audioarticles@vaarta.com
పెద్ద డైరక్టర్లు, పెద్ద హీరోలు, హీరోయిన్లు, సినిమాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా పూజా హెగ్డే గురించి కూడా ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి.
మొన్నటికి మొన్న పూజా హెగ్డే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిందని ఓ గాసిప్ చక్కర్లు కొట్టింది. తాజాగా ఆమె 'వాల్మీకి' సినిమా కోసం రూ.2కోట్లు తీసుకుందని మరో ప్రచారం జరిగింది మొదటి విషయాన్ని గురించి ఏమీ చెప్పలేదు కానీ, రెండో విషయం గురించి హరీష్ క్లారిటీ ఇచ్చాడు.
హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ "వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నేను రెండు విషయాల పట్ల స్పష్టతను ఇవ్వాలనుకుంటున్నా. వాటిలో ఒకటి పూజా హెగ్డే రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. రెండో విషయం ఏంటంటే, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌గారిని దర్శకత్వం చేయడం నాకు ఇష్టమే. కానీ ఆయన్ని నేను ఇటీవల కలిశానని వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదు" అని రాశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout