అన్నీ ఎలిమెంట్స్ తో అందరికీ నచ్చే చిత్రం 'టిక్ టాక్ ' - హరినాథ్ పొలిచెర్ల
Send us your feedback to audioarticles@vaarta.com
పి.హెచ్ ప్రొడక్షన్స్ నిర్మించిన హార్రర్, ఫన్, లవ్ కాన్సెప్ట్ మూవీ సినిమా `టిక్ టాక్`.హోప్ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుని, చంద్రహాస్ చిత్రానికి స్వర్ణ నందిని పొంది, సతీష్, దేవాకట్టా వంటి దర్శకుల్ని, వెన్నెలకిషోర్, పార్వతీమెల్టన్ వంటి నటీనటులను పరిచయం చేసిన సరోజిని దేవి ఇంట్రిగేషన్ అవార్డ్ గ్రహీత డా.పొలిచర్ల హరనాథ్ నిర్మిస్తూ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది.
ఈ సందర్భంగా హరినాథ్ పొలిచెర్ల సినిమా విశేషాలను తెలిపారు...
నాకు చదువుకునే రోజుల నుండి నటన అంటే చాలా ఆసక్తి ఉండేది. అయితే డాక్టర్ అయిన నేను వృత్తి పరంగా బిజీగా ఉండటంతో ఆలస్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను అని అన్న హరినాథ్ పొలిచెర్ల మాట్లాడుతూ..చిన్నప్పుడు హైస్కూల్స్ లో నాటికలు వేసేవాడిని. తర్వాత మెడికల్ కాలేజ్‌లో ఫైన్ ఆర్ట్స సెక్రటరీగా చేశాను. అలా నాకు చిన్నప్పటి నుండి నటనతో మంచి అనుబంధమే ఉంది. నేను మెడికల్ కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో ఇప్పుడు టిడిపి ఎంపి ఎన్.శివప్రసాద్‌గారు నాకు గురువు. ఆయనతో కలిసి ఆప్పటి నుండే నాటకాలు వేసేవాడిని. చదవు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లో అమ్మా నాన్నలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు.దాంతో నేను కాస్తా వెనక్కు తగ్గాను. ఆ సమయంలో నా సహోదరి నన్ను కెనడా తీసుకెళ్ళిపోయారు. అక్కడే చదువుకుని న్యూరాలజిస్ట్‌గా పదేళ్ళ పాటు వైద్య రంగంలోనే ఉండిపోయాను. తర్వాత ఇదేంటి ఇంతేనా అనే ఆలోచన రావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను.
నేను న్యూరాలజీ డాక్టర్‌ను ఇంకా డాక్టర్ వృత్తిలో నేను కష్టపడుతున్నాను. డబ్బు సంపాదిస్తున్నాను. అలా సంపాదించిన డబ్బుతో సినిమాలు తీయడం అనేది ఆత్మ సంతృప్తికి సంబంధించిన విషయం. సినిమాలు చేసేటప్పుడు నాకు మనోవికాశం కలుగుతుంది. ప్రతి సినిమా చేసేటప్పుడు మానసికాభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నాను.
ఇప్పుడు చేసిన టిక్ టాక్ సినిమా విషయానికి వస్తే..ఈ చిత్రంలో నేను మెకానిక్ పాత్రలో కనపడతాను. మనిషి బ్రతికున్నప్పటి జీవితం, టాక్ అంటే చనిపోయాక జీవితం అని అర్థం. సాధారణంగా మనిషి చనిపోయాక స్వర్గానికి వెళతాడు, ఆత్మ అవుతాడు అని పలు రకాలుగా అంటారు. ఆలా మరణం తర్వాత జీవితం ఏమిటనే ఆలోచనతో చేసిన సినిమానే ఇది. సినిమాలో హార్రర్ కంటెంట్‌తో పాటు అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేయబోతున్నాను. తర్వలోనే వాటి వివరాలు తెలియజేస్తాను అంటూ తెలియజేశారు హరినాథ్ పొలిచెర్ల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments