మంచి కథతో వస్తే ఇతరుల డైరెక్షన్ లో కూడా సినిమాను నిర్మిస్తాను : పోలిచర్ల హరనాథ్
Send us your feedback to audioarticles@vaarta.com
గతంలో హోప్, చంద్రహాస్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాథ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా రూపొందించిన చిత్రం టిక్ టాక్`. తాజాగా విడుదల చేసిన ఈ పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. శుక్రవారం ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా పోలిచర్ల హరనాథ్ చెప్పిన సినిమా విశేషాలు…
చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి…
నటనపైన ఉన్న మక్కువతోనే నేను సినీ రంగంలోకి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. పదేళ్ల వయసు నుంచి నాటకాలు వేసేవా డిని. స్కూళ్లలో డ్రామా కాంపిటేషన్‌లో పాల్గొనేవా డిని. కాలేజీ ఫ్రెషర్స్ డే, వార్షికోత్సవాల్లో నాటకా లు వేశాను.
దేవుడిపై నమ్మకం ఎక్కువ…
తిరుపతిలో పుట్టి పెరిగాను. చిన్న వయసులో ప్రతి నెలా రెండవ శనివారం తిరుపతి కొండకు నడుచుకుంటూ వెళ్లేవాడిని. పది సంవత్సరాలు అలా తిరుపతికి వెళ్లాను. దేవుడిపై నాకు నమ్మకం ఎక్కువ.
డ్యాన్సులు కూడా నేర్చుకున్నా…
అమెరికా తెలుగు అసోసియేషన్, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కార్య క్రమాలకు తరచుగా వెళ్తుండేవాడిని. వాటిలో ప్రదర్శన కోసం కూచిపూడి కూ డా నాట్యం నేర్చుకున్నాను. అంతేకా కుండా సల్సా డ్యాన్స్, సాంబ డ్యాన్స్ వెస్ట్రన్ డ్యాన్స్‌లు కూడా నేర్చుకోవడం జరిగింది.
సినిమా అనేది ఒక ఆర్ట్…
అమెరికాలో న్యూరాలజిస్ట్ డాక్టర్ గా దాదాపు పదేళ్లు బాగా కష్టపడి ఎంతో పేరుతెచ్చుకొని ఓ రేంజ్‌కు ఎదిగాను. మంచి పేరు తెచ్చుకో వడమే కాకుండా బాగా సంపా దించాను. ఆతర్వాతే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. సినిమా అనేది ఒక ఆర్ట్. దీన్ని వ్యాపారంగా నేను చూడను.
ఆలోచించి పనిచేయా ల్సి ఉంటుంది…
కథ, డైలాగులు రాయా లంటే, క్యారెక్టరైజేషన్‌ను తీర్చిదిద్దాలంటే బాగా ఆలోచించి పనిచేయా ల్సి ఉంటుంది. దీనివల్ల మనో వికాసం కలుగు తుంది. అలాగే సిని మాల వల్ల నాకు ఆ త్మ సంతృప్తి కలుగు తోంది. సినిమాల వల్ల నేను మరింత ఆరోగ్యవంతంగా ఉండగల్గుతున్నాను.
కన్నడలో తొలి మూవీ…
తొలిసారిగా నేను కన్నడ మూవీలో నటించాను. అమెరికాలో మా ఇంట్లో కన్నడ సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడే ఆ సినిమాలో చిన్న రోల్ చేశాను. ఆతర్వాత ఆ సినిమా దర్శ కుడి మరో కన్నడ మూవీలో కూడా నటించాను. ఆ చిత్రంలో ఎన్‌ఆర్‌ఐ రోల్ విలన్‌గా చేశా. అనంతరం తెలుగు ఇండస్ట్రీకి వచ్చేశాను.
చంద్రహాస్`తో మంచి పేరు…
తెలుగులో ప్రేమాయ నమః` సినిమా నా తొలి చిత్రం.. ఇం దులో ఓ క్యారెక్టర్ రోల్ చేశాను. సందీప్, కౌశల్ హీరోహీరో యిన్లుగా చేశారు. ఇక చంద్రహాస్` సినిమా చూసిన తర్వా త మా ఇంట్లో అందరూ బాగా నటించవన్నారు. ఈ చిత్రా నికి నంది అవార్డు కూడా వచ్చింది.
కథకు ప్రాముఖ్యతనిస్తా…
నా ప్రతి సినిమాలో కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తా ను. కథకు నేనెంతో ప్రాముఖ్యతనిస్తా. అయితే హీరోయిన్‌ల వల్లే సినిమాకు ప్రేక్షకులు పెద్దగా రారని నా అభిప్రాయం. పెద్ద హీరోయిన్‌తో పాటు మంచి హీరో ఉన్నప్పుడే సిని మాలు బాగా ఆడుతాయి.
మైథలాజికల్ సినిమాలంటే ఇష్టం…
మంచి కథతో వస్తే ఇతరుల డైరెక్షన్ లో కూడా సినిమాను నిర్మిస్తాను. అలాగే కథ బాగుంటే పెద్ద సిని మాలు కూడా చేస్తా. ఇక నాకు మైథలాజికల్ సినిమాలంటే ఇ ష్టం. భవిష్యత్తులో అన్నీ కుదిరి తే ఇలాంటి సినిమాను తెరకె క్కిస్తా.
వంద శాతం వినోదం…
టిక్ టాక్` మూవీలో వందశాతం వినోదం ఉంటుంది. కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. హీరోయిన్‌లతో రోమాన్స్ ఉం టుంది. కానీ అశ్లీలంగా ఉండదు. హీరోకు మర దలు క్యారెక్టర్ ఒకటైతే… మోడ్రన్ గర్ల్ క్యారెక్టర్ కూడా ఉం టుంది. ఇద్దరు హీరోయిన్లు చక్కగా నటించారు.
అందరికీ నచ్చే సినిమా…
ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన మాస్ మూవీగా దీన్ని తెరకెక్కించాం. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకముంది.
ప్రజలకు సేవ చేస్తున్నా…
మానవ సేవే మాధవ సేవగా భావిస్తాను. డాక్టర్ వృత్తిలో ప్రజలకు సేవ చేస్తున్నా. అమెరికాలో పేద రోగుల కు తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తాను. ఇదంతా ఆత్మ సంతృప్తి కోసమే.
లెజెండరీ ప్రొడ్యూసర్‌కు నిర్మాతగా…
నా కెరీర్‌లో మంచి సందేశం కూడిన చిత్రం హోప్`. ఈ చిత్రాన్ని సమాజం కోసమే తీశాను. సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామానాయుడు హీరో. నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న ఈ లెజెండరీ ప్రొడ్యూసర్ నటించిన సినిమాకు నేను నిర్మాతగా చేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సినిమా తర్వాత రామానాయుడు పలుసార్లు నేను కనిపించిన ప్పుడల్లా… మా ప్రొడ్యూసర్ అని చెప్పేవారు. అదెంతో సంతోషాన్నిచ్చేది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout