తండ్రితో కలసి నటిస్తున్నఎన్టీఆర్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్..ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో..సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా సంస్థ కార్యాలయంలో నిన్న ప్రారంభమైంది. ఈ చిత్రానికి జనతా గ్యారేజ్ టైటిల్..అన్ని రిపేర్ చేయబడును ట్యాగ్ లైన్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ తండ్రి,సీనియర్ నటుడు హరిక్రిష్ణ ఓ పవర్ ఫుల్ రోల్ లోనటించనున్నట్టు ఫిలింనగర్ సమాచారం ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండగే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments