రామ్ హరికథ మారింది

  • IndiaGlitz, [Wednesday,November 11 2015]

రామ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం హ‌రిక‌థ‌. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్నారు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకుంది జ‌న‌వ‌రి 1న ఈ చిత్రాన్నిగ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే హ‌రిక‌థ అనే టైటిల్ మార్చాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట చిత్ర‌యూనిట్. హ‌రిక‌థ కాకుండా...నేను...శైల‌జ అనే టైటిల్ పెట్టాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే టైటిల్ పై క్లారిటీ వ‌స్తుందంటున్నారు. స‌రైన స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కి ఈసారైనా విజ‌యం వ‌రిస్తుందో లేదో చూడాలి.

More News

అఖిల్ మూవీ రివ్యూ

అఖిల్ అక్కినేని అనే పేరు ఇటీవలి కాలంలో సినిమా పరిశ్రమలోనే కాదు... సర్వత్రా ఆసక్తిగా వినిపిస్తున్న పేరు. అక్కినేని మూడో తరం కథానాయకుడిగా సినిమా పరిశ్రమకు పరిచయం కానున్నారు అఖిల్. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున కొడుకు, అక్కినేని నాగచైతన్య తమ్ముడు..

సంక్రాంతికి పక్కా అంటున్న 'డిక్టేటర్'

నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

నిత్యాకి ఇది మళ్లీ మళ్లీ రాని సంవత్సరమే

సౌత్ లోని అన్ని భాషల్లోనూ నటిగా తన సత్తాని చాటుకుంది కేరళ కుట్టి నిత్యా మీనన్.అయితే..ఈ సంవత్సరం మాదిరిగా మరే సంవత్సరం నిత్యాకి విజయాలను,గుర్తింపుని తీసుకురాలేదనే చెప్పాలి.

అప్పుడు బాలకృష్ణ...ఇప్పుడు కళ్యాణ్ రామ్

నందమూరి బాలకృష్ణతో పదేళ్ల క్రితం ఓ భారీ సినిమా తీసి హిట్ కొట్టలేకపోయిన ఓ దర్శకుడు..మళ్లీ పదేళ్ల తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

సునీల్ సంద‌డే సంద‌డి

సునీల్ గ‌త చిత్రం 'భీమ‌వ‌రం బుల్లోడు' రిలీజై అటుఇటుగా రెండేళ్లు అవుతోంది. అత‌ని కొత్త చిత్రం 'కృష్ణాష్ణ‌మి' ఈపాటికే రావాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల డీలే అవుతోంది.