Hari Hara Veera Mallu: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్. అదరగొడుతున్న 'హరిహర వీరమల్లు' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల సమయం కావడంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే ఆయన హీరోగా నటిస్తున్న కొన్ని సినిమాల అప్డేట్స్ మేకర్స్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నారు. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సీనియర్ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' టీజర్‌ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది.
పీరియాడిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ ప్రజల పక్షాన పోరాడే ఓ వీరుడిగా పవన్ నటిస్తున్నాడు. 17వ శతాబ్దంలో నవాబులు, మొఘలలు ప్రజలను దోచుకుంటుంటే వాళ్ళని దోచుకోవడానికి ఓ దొంగ వస్తాడు. పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా ఈ చిత్రం ఉంటుందని ఇందులో చూపించారు. ఇక టీజర్లో పవన్ యాక్షన్ సీన్స్ దుమ్మురేపాడు. కత్తి సాముతో పోరాట సన్నివేశాల్లో ఇరగదీశాడు. అంతేకాకుండా ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పి అభిమానుల్లో మరింత జోష్ నింపారు.
మూవీ "పార్ట్-1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" పేరుతో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పవన్ కల్యాణ్‌కు మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమనులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్‌గా క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు. మిగిలిన షూటింగ్‌ను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తాడని మూవీ యూనిట్ పేర్కొంది. జ్యోతికృష్ణ గతంలో నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్, రూల్స్ రంజన్ లాంటి పలు సినిమాలని తెరకెక్కించాడు. మరికొన్ని సినిమాలకు రచయితగా కూడా పనిచేశాడు.
ఇక పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే గతేడాది మెగా మేనల్లుడు సాయితేజుతో కలిసి 'బ్రో' సినిమాలో నటించాడు. ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. అలాగే సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది. దీంతో పాటు హరీశ్ శంకర్ డైరెక్షన్లో 'ఉస్తాద్ భగత్‌సింగ్' మూవీలోనూ యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలన్ని వచ్చే ఏడాది లోపు విడుదల కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout