హైదరాబాద్‌లో ఆ హోటల్ అంటే అసహ్యమేస్తోంది: భజ్జీ
Send us your feedback to audioarticles@vaarta.com
అవును హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్ యాజమాన్యంపై క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే ఛీ.. ఆ హోటల్ అంటేనే అసహ్యమేస్తోందని ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని బజ్జీ వ్యక్తం చేశారు. అసలు భజ్జీ ఎందుకు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు..? ఎందుకింత అసహ్యంగా ఉందని చెబుతున్నాడు..? ఇంతకీ ఆ హోటల్ ఏంటి..? భజ్జీ ట్వీట్‌కు హోటల్ యాజమాన్యం రియాక్ట్ అయ్యిందా..? లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదీ అసలు సంగతి..!
ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్- ముంబయి ఇండియన్స్ టీమ్‌ల మధ్య ఐపీఎల్-12 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్ ఆడటానికి అంతకముందు వైజాగ్‌లో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో బస ఏర్పాటు చేశారు. అసలే వరుస మ్యాచ్‌లు ఆడి అలిసిపోయిన జట్టు.. మరోవైపు ఫైనల్ ఎలా ఉంటుందో..? ఏంటో..? ఒకటే టెన్షన్. ఈ పరిస్థితులో కాసింత మంచి ఫుడ్ తిందామంటే.. హర్బజన్‌కు దొరకలేదు. అంతేకాదు ఆహారం సరిగ్గా వండలేదని.. సిబ్బంది సరిగ్గా లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ భజ్జీ ట్వీట్ చేశాడు.
భజ్జీ ట్వీట్ సారాంశం..
"నేను ఐటీసీ హోటల్స్‌లో ఉండాలంటే చాలా ఇష్టపడతాను. మన భారతదేశంలో చాలా ఐటీసీ హోటల్స్‌లో స్టే చేయడానికి ఎంతో ఇష్టపడతాను. కానీ హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్ అంటేనే నాకు అసహ్యమేస్తోంది. అసలు ఆహారం సరిగ్గా ఉందా లేదా..? సరిగ్గా ఉడికిందా లేదా..? అని కూడా చూడట్లేదు. రూమ్ సర్వీస్ కోసం సిబ్బంది నుంచి మేనేజర్ వరకు ఎవర్ని అడిగినా సరిగ్గా స్పందిచలేదు. బహుశా వాళ్లంతా అతిథులతో చాలా బిజీబిజీగా ఉన్నారేమో" అని భజ్జీ తన అసహనాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు.
ఇంత వరకూ రియాక్షన్ లేదు..!
అయితే.. భజ్జీ ట్వీట్‌కు ఇంత వరకూ హోటల్ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం. టీమిండియా క్రికెటర్ స్థాయి వ్యక్తి ఇలాంటి ట్వీట్ చేశారంటే రేపొద్దున సెలబ్రిటీలు ఎవరైనా ఈ హోటల్‌కు రావడానికి ఇష్టపడతారా..? కనీసం.. తప్పయిపోయింది.. సారీ సార్ క్షమించండి అని సింగిల్ ట్వీట్ చేస్తూ రియాక్ట్ అయ్యుంటే బాగుండేదేమో. ఇదిలా ఉంటే భజ్జీ ట్వీట్ చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు పెద్దఎత్తున రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత అభిమానులు ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి సార్... మ్యాచ్‌ను మాత్రం గెలిపించండి అంటూ కోరుతున్నారు.
As much as I love staying with you @ITCHotels in all the other cities ..I hate staying at #ITCKAKATIYA Hyderabad..No one cares bout food cooked properly or not.. No one respond to the calls from duty manager to room service..They seems to be to busy for the guests
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 12, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com