హర్భజన్ సింగ్ హీరోగా 'ఫ్రెండ్ షిప్' మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి 'ఫ్రెండ్ షిప్' సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రల‌లో యాక్షన్ కింగ్ అర్జున్, త‌మిళ న‌టుడు స‌తీష్‌ న‌టిస్తున్నారు. కాగా ఈరోజు 'ఫ్రెండ్ షిప్' మూవీ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, ‌లోస్లియా మ‌రియ‌నేస‌న్ క‌లిసి ఉన్న ఈ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్ల‌డించనున్నారు.

హర్భజన్ సింగ్, యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, త‌మిళ న‌టుడు స‌తీష్‌, లోస్లియా మ‌రియ‌నేస‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్: వేల్‌మురుగ‌న్‌, రాబిన్‌, ప్రొడ్యూస‌ర్స్: జెపిఆర్ & స్టాలిన్, ద‌ర్శ‌క‌త్వం: జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య

More News

తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే మార్గదర్శకాలు ఇవే..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో లాక్ డౌన్‌లోనూ కైంకర్యాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఢిల్లీకి చేరిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై మీరా చోప్రా కేసు

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

త్వరలో కేసీఆర్‌ను కలవనున్న బాలయ్య..!?

టాలీవుడ్ గత కొన్ని రోజులుగా నటుడు కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం విదితమే.

బాలయ్య గురించి పోసాని ఏమన్నారంటే...

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ 31 టైటిల్‌ ఇదేనా!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి భారీ బ‌డ్జెట్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’లో