ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది అనే కాన్సెప్ట్ తో హ్యాపీ బర్త్ డే
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నమనేని శ్రీధర్, జ్యోతిసేధీ, సంజన, శ్రవణ్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం హ్యాపీ బర్త్ డే. శ్రీనందన్ మూవీస్ పతాకం పై మహేష్ కల్లే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పల్లెల వీరారెడ్డి (చేగువేరా) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు పల్లెల వీరారెడ్డి మాట్లాడుతూ...పుట్టినరోజు వేడుక నేపధ్యంలో ఒకే ఇంట్లో జరిగే కథ ఇది. సాయంత్రం 7 నుంచి 12 గంటల వరకు ఈ నాలుగు గంటల్లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో 15 నిమిషాల గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అవుట్ పుట్ బాగా వచ్చింది అని తెలిపారు.
నిర్మాత మహేష్ కాలే మాట్లాడుతూ...ప్రస్తుతం హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు మంచి మార్కెట్ ఉంది. మా దర్శకుడు హర్రర్ సినిమాల్లో ఓ కొత్త కథను చెప్పగానే చాలా ఇంట్రస్టింగ్ గా ఉండడంతో వెంటనే ఈ సినిమా నిర్మించేందుకు అంగీకరించాను. కథ, కథనం ఆసక్తికరంగా ఉంటాయి. వైజాగ్, హైదరాబాద్ లో మేజర్ షూటింగ్ చేశాం. కీలకమైన సన్నివేశాలు కొన్నింటిని విదేశాల్లో చిత్రీకరించాం. ప్రస్తుతం ఆర్.ఆర్ డి.ఐ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక పాటల్ని విడుదల చేస్తాం. జులైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా - వాసిరెడ్డి సత్యానంద్, సంగీతం - సంతోష్ రెడ్డి, ఎడిటర్ - మహేంద్రనాథ్, ఆర్ట్ - మురళీకృష్ణ కొండేటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -కోటేశ్వరరావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చంద్రారెడ్డి, కో డైరెక్టర్ గండికోట రవీంద్రకుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout