‘వి’ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా జస్టిఫికేషన్ ఉన్న పాత్ర చేయడం చాలా హ్యాపీగా అనిపించింది : సుధీర్‌బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగా, నిర్మాతగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు సుదీర్ బాబు. ‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన చిత్రం ‘వి’. నేచురల్ స్టార్ నాని కూడా ఇందులో నటించారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతుంది. ఈ సందర్భంగా వెబినార్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ ..
‘వి’ సినిమాను ముందుగా థియేటర్స్‌లో విడుదల చేయాలనే అనుకున్నాం. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్‌లో సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. అందుకనే ఓటీటీలోనే విడుదల చేస్తున్నాం. ఓటీటీలో సినిమాను విడుదల చేయడం కూడా ప్లస్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ‘వి’ సినిమాను 200 దేశాల్లో సినిమాను విడుదల చేస్తున్నాం.. దీని వల్ల తొలి రోజునే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్.
లాక్డౌన్ సమయంలో రెండు రోజులకొక కథ చొప్పున వింటూ వచ్చాను. అందులో రెండు కథలను కూడా ఓకే చేశాను. ఆ వివరాలను సదరు నిర్మాణ సంస్థలు ప్రకటిస్తేనే బావుంఉటుంది.
‘వి’ సినిమాలో నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలిచే పాత్ర. ఇంద్రగంటిగారు కథ చెప్పగానే నాకు కూడా ఈ పోలీస్ ఆఫీసర్ పాత్ర బాగా నచ్చింది. చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండే సదరు ఆఫీసర్‌ను ఓ కిల్లర్ ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడనేదే సినిమా. జస్టిఫికేషన్ ఉండే పాత్రలో కనిపిస్తాను.
సినిమాలో యాక్షన్, డ్రామాకు మంచి స్పేస్ కుదిరాయి. యాక్షన్ విషయానికి వస్తే .. సాధారణంగా బాడీని ఫిట్‌గానే ఉంచుకుంటాను. రెఫరెన్స్‌గా ఇంద్రగంటిగారు బ్రాడ్‌పిట్ యాక్ట్ చేసిన ఫైట్ క్లబ్ తరహాలో నా బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని కూడా చెప్పారు. దాంతో నేను బాడీని మరింత ఫ్లెక్సిబుల్‌గా చేసుకున్నాను.
నా ఇంట్రడక్షన్ ఫైట్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఫైట్ మాస్టర్ రవివర్మగారు ఆ ఫైట్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారు.
ట్రైలర్ చూసిన తర్వాత మహేశ్‌కు అందులో యాక్షన్ పార్ట్ బాగా నచ్చింది. ఆ విషయాన్ని నాకు చెప్పారు. తనకు ఇంద్రగంటిగారంటే చాలా మంచి ఓపినియన్ ఉంది. ‘సమ్మోహనం’ టైంలో ఆ విషయాన్ని నాకు చెప్పారు. ‘వి’ సినిమా కోసం తను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పారు మహేశ్.
హీరోయిన్ నివేదా ఇందులో అపూర్వ పాత్రలో కనిపిస్తుంది. తను క్రైమ్ నవలా రచయిత. మా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కంటే హీరో, విలన్ మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. అలాగే అదితిరావు హైదరి కూడా చక్కటి పెర్ఫామెన్స్ చేసింది. తన పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఇంద్రగంటిగారు సినిమాల్లో మంచి సంభాషణలుంటాయి. ఈ సినిమా విషయానికి వస్తే మంచి సంభాషణలతో పాటు మంచి యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది.
నేను, నాని కంఫర్ట్ యాక్టర్స్, ఇద్దరం కొలతలు వేసుకుని నటించలేదు. ఆర్టిస్ట్‌గా నమ్మకం ఉండటంతో నానితో కలిసి ఈ సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేశాను. ఇద్దరం పోటీ పడటం అనడం కంటే మా క్యారెక్టర్స్ ఇందులో పోటీపడతాయని చెబితే చక్కగా ఉంటుంది.
ఇంద్రగంటిగారు .. సెట్స్ లో మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. ఆయన సెట్లో ఆర్టిస్టులు రిలాక్స్డ్గా ఉంటారు. కానీ డైరెక్టర్‌గా టెన్షన్ అంతా ఆయనే తీసుకుంటారు. సినిమా ముందు యూనిట్‌ను ఇంద్రగంటి గారు చాలా ప్రిపేర్ చేస్తారు.. కాబట్టి సెట్స్ కు వచ్చేటప్పటికీ చాలా కాన్ఫిడెంట్ గా వస్తారు.
విలనిజం ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఉదాహరణకు నేను బాఘిలో చేసిన విలనిజం ఈ సినిమాతో పోల్చితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలో నాని నెగటివ్ షేడ్స్‌లో తన యాక్టింగ్‌తో ఓ డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడు.
పుల్లెల గోపీచంద్‌గారి బయోపిక్ కొన్ని కారణాలతో వెనక్కి వెళుతుంది.. డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇది నేను చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ.
మంచి కాన్సెప్ట్స్ కోసం బాగా వెయిట్ చేస్తాను. నేనే అని కాదు.. ఎవరైనా మంచి కాన్సెప్టులను సెలక్ట్ చేసుకోవాలి. అందుకే నేను చూసిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
వెబ్ సిరీస్‌లను కూడా చేయడానికి అభ్యంతరం లేదు. మంచి ప్రొడక్షన్ హౌసెస్, బడ్జెట్ కుదిరితే చేయడానికి ఏమాత్రం ఆలోచించను. అలాగే నా ప్రొడక్షన్లోనూ వెబ్ సిరీస్‌లను చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.
నిర్మాతగా కూడా జాయింట్ వెంచర్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com