Record Break: 'రికార్డ్ బ్రేక్' ప్రీమియర్ షోలకు వచ్చిన స్పందన చూసి సంతోషంగా ఉంది: చదలవాడ
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ హీరోగా నటించిన 'రికార్డ్ బ్రేక్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న విడుదలకానంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు వారం ముందే మీడియాకు ప్రదర్శించడమైనది. ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ "ఎంతోకాలంగా నాతో ప్రయాణం చేస్తున్న నా మిత్రుడు నలమాటి వెంకటకృష్ణారావు ఈ సినిమా ప్రీమియర్ షోలకి వచ్చి కొబ్బరికాయ కొట్టి తన సపోర్ట్ ని నాకు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్ తో ఉంటారు. ఆయన చేతుల మీదగా ఈ ప్రీమియర్ షోల్డర్ స్టార్ట్ చేయించాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఆయన ఎంతో బిజీగా ఉన్న రాజమండ్రి నుంచి నాకోసం వచ్చి ఈ ప్రీమియర్ షోలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది తెలుగు వాళ్లకు సంబంధించిన రైతులకు సంబంధించిన అదేవిధంగా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. అదేవిధంగా నేను అనుకున్నట్టుగా నా స్నేహితుడు పంచ కట్టుతో ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రీమియర్ షోలు స్టార్ట్ చేయడం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు.
పెద్ద హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను పిలవగానే ఈ ప్రీమియర్ షోలకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న దర్శకులు విజయేంద్రప్రసాద్ గారికి, జయసుధ గారికి, ఆర్ నారాయణ మూర్తి గారికి, రైటర్ చిన్ని కృష్ణ గారికి, దర్శకులు చంద్ర మహేష్, సునీల్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. వారు ఈ సినిమా చూసి మంచి సినిమాను మెచ్చుకోవడం తల్లి సెంటిమెంట్ గురించి దేశభక్తి గురించి మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. మా నటీనటుల్ని, టెక్నీషియన్స్ ని ఈ సినిమాని ప్రేక్షకుల ఆదరించి ఆశీర్వదించాలని మంచి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని వెల్లడించారు.
దర్శకులు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రికార్డ్ బ్రేక్ చాలా మంచి సినిమా. టెక్నికల్ వాల్యూస్, ఆర్ఆర్ చాలా బాగున్నాయి. ఇది ఒక కొత్త అటెంప్ట్. చదలవాడ శ్రీనివాసరావు గారి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవ్వాలని అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
సీనియర్ నటులు ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ తల్లి సెంటిమెంట్ ని చాలా బాగా చూపించారు. మన పుట్టుక మొదలుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాం మన మట్టికిచ్చే వ్యాల్యూ ఏంటి అన్న అంశాలను చాలా బాగా చూపించారు. మన బలం ఏంటి మనం తినే తిండి ఏంటి మనిషి ఎలా ఉండాలి అని విలువలు చాలా బాగా చూపించారు. ఈ రికార్డ్ బ్రేక్ మూవీ కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
జయసుధ మాట్లాడుతూ ఈ సినిమాలో నిహార్ నటించిన చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు చేశాడని కాకుండా చెప్తున్నా ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై నేను చాలా సినిమాల్లో నటించాను. ఈ బ్యానర్ తో చదలవాడ శ్రీనివాసరావు గారితో చాలా మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి ఈ రికార్డ్ బ్రేక్ మూవీ రావడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. సినిమాలో చాలా మంచి విలువలు ఉన్నాయి కచ్చితంగా అందరూ చూసి మెచ్చుకునే సినిమా అవుతుందన్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ఈ సినిమా చూసి సినిమాలో ఉన్న తల్లి సెంటిమెంట్ గురించి, దేశభక్తి గురించి, రైతుల గురించి, భారతీయులు గర్వించదగ్గ సినిమా అని మెచ్చుకున్నారు.
ఇక ఈ సినిమాలో నిహార్ కపూర్, నాగార్జున, సత్య కృష్ణ, టి. ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకునిగా ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాకి కథ అంగిరెడ్డి శ్రీనివాస్ గారు అందించగా డివోపిగా కంతేటి శంకర్ మరియు సాబు వర్గీస్ మ్యూజిక్ అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments