కరోనా దయవల్ల హ్యాపీగా ఉన్నా..: ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి టైటిల్ చూడగానే.. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. లోకమంతా భయంతో వణికిపోతుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హ్యాపీగా ఉండటమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండోయ్.. అదే కదా మరి ఆర్జీవీ స్పెషాలిటి అంటే. ‘నా రూటే సపరేటు.. నా మాటలు యమా డిఫరెంట్’ అని పదే పదే నిరూపించుకుంటూ ఉంటాడు ఆర్జీవీ. లాక్ డౌన్‌లోనూ సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ బంద్‌లో ఉన్నప్పటికీ ఈయన మాత్రం వరల్డ్‌లో ఫస్ట్ టైమ్ ‘కరోనా’ పై సినిమా చేసేశారు. ఇందుకు సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశారు. త్వరలోనే సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో ఇబ్బందులుంటాయ్..
‘కరోనా వైరస్ దయవల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే లాక్ డౌన్ ముందుకంటే ఎక్కువగా పనిచేసేస్తున్నాను. లైఫ్‌లో ఏది జరిగినా ఒక ఎక్స్‌పీరియన్స్. ఆ అనుభవం నుంచి నెగిటివ్ తీసుకోవాలా లేకుంటే పాజిటివ్ తీసుకోవాలా..? మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఉండే, పుట్టిన పరిస్థితులు గానీ, సోషల్.. ఫైనాన్స్ సిచువేషన్స్ అనేవి అందరికీ రకరకాలుగా ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు ఉంటాయ్.. ఇంకెన్నీ కష్టాలుంటాయ్.. అందులో ఈ కరోనా అనేది ఒక్కటి జాయిన్ అయింది అంతే’ అని కరోనాను ఆర్జీవీ సింపుల్‌గా తీసిపారేశాడు.
అన్ని పాటించే చేశాం..
‘చాలా మంది నా స్టాఫ్‌లో పెళ్లి కాని వారున్నారు. వాళ్లంతా ఆఫీస్‌లోనే ఉన్నారు. ఇది వారికి ఇళ్లు లాంటిది. ఇది ఆఫీస్ కమ్ హోమ్ మా అందరికీ. నా స్టాప్ అంతా నా దగ్గరే ఉన్నారు. అందుకే మునుపటిలాగే మేం వర్క్ చేసుకుంటూనే ఉన్నాం. కరోనా వైరస్ సినిమాను మేం మొత్తం ఇండోర్‌లోనే షూట్ చేసేశాం. లాక్ డౌన్ పెట్టిన తర్వాత ఒక ఫ్యామిలీ అనేది ఎలా ఇబ్బంది పడుతోందని ఈ సినిమా తీశాం. గవర్నమెంట్ చెప్పిన అన్ని నియమ నిబంధనలనూ మేం పాటించాం’ అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
ఎవరికీ ఏమీ తెలియదు..
అంతటితో ఆగని ఆయన.. ‘ఒకానొక సందర్భంగా ట్రంప్ మొదలుకుని సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ ఇలా అందరూ పారాసెటిమాల్, బ్లీచింగ్ పౌడర్ ఏదేదో అన్నారు. ఆ తర్వాత కొద్దిరోజులుగా అయ్యో ఇది చాలా డేంజర్ అని కూడా అన్నారు. వీరందరికీ ఎవరికీ ఏమీ తెలియదు. ఇప్పుడు ఏ రేంజ్‌లో కేసులు నమోదు అవుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. లాక్ డౌన్ పెట్టడం వల్ల ఇన్నే నమోదయ్యాయి.. లేకుంటే ఇంకా పెరిగేవి అనేది ఒక ఆర్గుమెంట్. ఇంకోటి మాత్రం ఏమున్నా.. లేకున్నా ఇవే కేసులే నమోదయ్యేవి అనే ఆర్గుమెంట్ కూడా ఉంది. దీన్ని ఎవరూ నిరూపించలేరు’ అని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు, ఆర్జీవీ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘అబద్దాలు చెబితే.. బాబు చెప్పాలి. నిజాలు చెబితే RGV చెప్పాలి... ఇద్దరికి తిరుగుండదు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో జై ఆర్జీవీ అంటూ నినదిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments