'హ్యాపీ వెడ్డింగ్' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవలే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క తో భాగమతి లాంటి సూపర్ బ్లాక్బస్టర్ ని సాధించిన యువి క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా సంయుక్తంగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంటగా నిర్మిస్తున్న సినిమా 'హ్యపీ వెడ్డింగ్ షూటింగ్ పూర్తిచేసుకుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు. ఈ కథ చెప్పగానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహరిక మెట్టమెదటి సారి సుమంత్ అశ్విన్ తో చేయటం విశేషం. వీరిద్దరి మద్య జరిగే చక్కటి కథ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఫిదా లాంటి సూపర్ బ్లాక్బస్టర్ ఫిల్మ్ కి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే సందర్బంగా ఈచిత్రం యెక్క మెదటి లుక్ ని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. సమ్మర్ లో చిత్రం విడుదల చేస్తారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విజయాలు సాధిస్తున్న క్రేజి బ్యానర్ యు వి క్రియోషన్స్ బ్యానర్ లో 2018 లొ భాగమతి తో సూపర్ బ్లాక్బస్టర్ ని సాధించినందుకు యు వి క్రియోషన్స్ వారికి మా శుభాకాంక్షలు. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ తో మేము అసోసియోట్ గా హ్యపివెడ్డింగ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్, నిహారిక లు జంటగా నటిస్తున్నారు. ఫిదా లాంటి మ్యూజిక్ ఛార్ట్బస్టర్ ని అందించిన శక్తికాంత్ కార్తిక్ మా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
రోమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పొస్ట్ప్రోడక్షన్ లో బిజిగా వుంది. దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకుడు. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగేరోజు వరకూ మద్యలో రెండు కుటుంబాల మద్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా మా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ఓక్కరి జీవితం లో ఇలాంటి అనుభవం జరిగివుంటుంది. ప్రతిప్రేక్షకుడ్ని ఈ పాత్రలో తమనితాము చూసుకునేలా పాత్రల్లో ప్రేక్షకులు లీనమయ్యేలా ప్రతి పాత్ర తీర్చిదిద్దాము. ఈ సమ్మర్ కి పెర్ఫెక్ట్ ఫ్యామిలి అండ్ రోమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం యెక్క మెదటి లుక్ ని విడుదల చేస్తాము .. అని అన్నారు..
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నిహరిక, నరేష్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments