Anand Ravi: ‘కొరమీను’ సినిమా చూసి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు - ఆనంద్ రవి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కోరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ... ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’.
డిసెంబర్ 31న సినిమా రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి ‘తెలిసిందే లే..’ అనే సాంగ్ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. బింబిసార దర్శకుడు వశిష్ట, సింగర్ సునీత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో..లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక, పూర్ణాచారి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, ఇందు, కిషోరి తదితరులు మాట్లాడారు.
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ‘‘కామెడీ అనే కాకుండా ఓ మంచి రోల్ ఇచ్చిన మా డైరెక్టర్ శ్రీపతిగారికి థాంక్స్. కొరమీను అనే టైటిల్ వినగానే ఆశ్చర్యపోయాను. నిజంగానే రేపు సినిమా చూస్తే ఈ టైటిల్ ఎందకు పెట్టారని అర్థమవుతుంది. ఆనంద్ రవిగారు నీడను బేస్ చేసుకుని నెపొలియన్ అనే సినిమా చేశారు. ఇప్పుడు కొరమీను సినిమా చేశారు. సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ కిషోరీ దత్రక్ మాట్లాడుతూ ‘‘నిర్మాత సమన్య రెడ్డిగారికి థాంక్స్. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం. ఆయన ఇంకా మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ శ్రీపతిగారు మీనాక్షి అనే మంచి రోల్ ఇచ్చారు. హరీష్ ఉత్తమన్ గారితో కాంబినేషన్ సీన్స్ చక్కగా కుదిరాయి. నా పాత్ర మంచి ఇంపాక్ట్ ఉంటుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
సౌండ్ డిజైనర్ సాయివర్మ మాట్లాడుతూ ‘‘సముద్ర తీర ప్రాంతంలోని జాలర్ల పేట అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. నేను నా టీమ్‌తో కలిసి చాలా వర్క్ చేశాను. ఇన్‌టెన్స్ షూట్ చేశాం. 31 రోజుల్లోనే షూటింగ్ చేశాం. 10 రోజులు ప్యాచ్ వర్క్ పూర్తి చేశాం. సౌండింగ్ చాలా చక్కగా కుదిరింది. మ్యూజిక్ డైరెక్టర్ అనంత్ అద్భుతమైన నాలుగు పాటలను ఇచ్చాడు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. గుడ్ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది’’ అన్నారు.
దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ ‘‘మా టీమ్‌కి సపోర్ట్ చేయటానికి వచ్చిన దర్శకులు వశిష్టగారికి, సింగర్ సునీత గారికి థాంక్స్. సినిమాకు కథ ప్రధానం. అది బావుంటే అన్నింటినీ అదే తీసుకొస్తుంది. ఆనంద్ రవిగారు అంత మంచి కథను ఇచ్చారు. ఆయన దగ్గరే విషయాలు నేర్చుకున్నాను. మా గురువుగారినే డైరెక్ట్ చేశాను. కథను చక్కగా డ్రైవ్ చేసేది టీమ్. ఆ టీమ్‌కు సపోర్ట్ చేసేది నిర్మాత సమన్య రెడ్డిగారు. సినిమాను మన కోసం అనుకున్నాం. మన కోసం చేసుకుంటూ శాటిస్పై చేస్తే అందరినీ శాటిస్పై చేయవచ్చు అన్నారు. అలాంటి నిర్మాత దొరికినందుకు చాలా అదృష్టవంతుడిని. పూర్ణాచారి, ప్రియాంకగారుచక్కగా లిరిక్స్ రాశారు. ఆనంత్ నారాయణ్ నెక్ట్స టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారు. శత్రుగారు అద్భుతమైన పాత్ర చేశారు. ఇందు, కిషోరి పాత్రల్లో ఒదిగిపోయారు. డేడికేషన్ లెవల్ వల్ల వాళ్లు ఇంకా ఎదుగుతారు. నేను వైజాగ్‌లో పుట్టి పెరిగాను. దాన్ని డిఫరెంట్‌గా చూపించాలని అనుకున్నాను. ముందుగానే ప్రీ వర్క్ చేసి షూటింగ్ చేశాం.
నిర్మాత సమన్య రెడ్డి మాట్లాడుతూ ‘‘ఆనంద్ రవిగారు కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. కీ రోల్‌లో శత్రు, విలన్‌గా హరీష్ ఉత్తమన్‌గా తీసుకోవాలని అనుకున్నాం. అలా అన్ని క్యారెక్టర్స్ గురించి నెరేషన్ సమయంలోనే మాట్లాడుకున్నాం. ఇక హీరోగా ఆనంద్ రవిగారు అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. గంగ ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డిగారికి, మ్యాంగో మీడియా రామ్ అన్నగారికి థాంక్స్’’ అన్నారు.
వశిష్ట మాట్లాడుతూ ‘‘ప్రతినిధి సినిమాకు రైటర్, నెపోలియన్ సినిమాకు రైటర్‌గా, హీరోగా సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్‌ప్లే అందించి హీరోగా కూడా నటించారు. ఈ సినిమాతోనూ సక్సెస్ సాధిస్తారని భావిస్తున్నాను. నిర్మాత సమన్య రెడ్డిగారికి, దర్శకుడు శ్రీపతిగారు సహా అందరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 31న ఈ ఏడాది కొరమీను బెస్ట్ సెండాఫ్ ఇస్తుందని భావిస్తున్నాను’’ అన్నారు.
సింగర్ సునీత్ మాట్లాడుతూ ‘‘‘కొరమీను’ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒకరికి నా బెస్ట్ విషెస్. ఈరోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీతలు చెరిగిపోయాయి. కంటెంట్ బావుంటే కొత్త నటీనటులతో చేసిన మూవీ అయినా ప్రపంచ వ్యాప్తంగా పేరుని సంపాదించుకుంటుంది. అటువంటి లిస్టులో కొరమీను సినిమా కూడా చేరుతుంది. నమ్మి డబ్బులు పెట్టిన సమన్య రెడ్డిగారికి ఆల్ ది బెస్ట్. ఆనంద్ రవిగారు నాకు హ్యాపీడేస్ నుంచి పరిచయం. ఆయన మంచి రైటర్, నటుడు అయ్యారు. ఆయనకు కంగ్రాట్స్. టీజర్ చూడగానే మీసాల గురించి ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయవచ్చా అనిపించింది. డైరెక్టర్‌కి హ్యాట్సాఫ్. మ్యూజిక్ డైరెక్టర్ అనంత్ వర్క్ చూస్తే తన ఫస్ట్ సినిమాలాగా అనిపించలేదు. కచ్చితంగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. మన జీవన విధానానికి దగ్గరగా ఉండే సినిమాలు సక్సెస్ అవుతాయి. అలాంటి ఓ సినిమానే కొరమీను. అలాంటి మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఇది కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. సాంగ్స్, మ్యూజిక్ ద్వారా ఈ పాటలు రిలీజ్ కావటం నాకెంతో గర్వంగా ఉంది’’ అన్నారు.
హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ ‘‘కొరమీను సినిమాలో మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశారనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రపంచమంతా సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి. కానీ ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కాబట్టి ఇదొక జోనర్ మూవీ అనొచ్చు. దీన్నొక మీసాల మిస్టరీ అనుకోవచ్చు. కథ పుట్టిందే అక్కడ నుంచే. పేదవాడికి, గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను కథలో తీసుకున్నాం. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఎంతో కీలకం. మీరు సినిమా చూస్తే సర్ ప్రైజ్ అవుతారు. మా టీమ్‌కు చక్కగా చూసుకున్న నిర్మాతగారికి థాంక్స్. థ్రిల్లర్ మూవీయే కాదు.. మంచి మ్యూజిక్ కంటెంట్ కూడా ఉంది. మ్యూజికల్ ఫిల్మ్‌గా సినిమాను ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 31న సినిమాను చూసి న్యూ ఇయర్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేం కూడా అంతే హ్యాపీగా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునేలా చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు: కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments