close
Choose your channels

హ్యపీ బర్త్‌డే టు మాటల మాంత్రికుడు, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌

Saturday, November 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హ్యపీ బర్త్‌డే టు మాటల మాంత్రికుడు, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌... టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు..

రైట‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్‌గా మారి, ఎన్నో హిట్స్‌, సూప‌ర్‌హిట్స్‌, బ్లాక్‌బస్ట‌ర్ హిట్స్‌ను తెర‌కెక్కించి మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన ఖ్యాతిగ‌డించారు. రైట‌ర్ నుండి డైరెక్ట‌ర్‌గా మారే క్ర‌మంలో ఆయ‌న ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ ఇప్ప‌టికీ ఎంద‌రో రైట‌ర్స్‌కు, డైరెక్ట‌ర్స్‌కు ఇన్‌స్పిరేష‌న్ ఇస్తుంది.

మాట‌ల ర‌చ‌యిత‌గా..

ఓ సినిమాకు డైరెక్ట‌ర్‌కో, హీరోకో, ఇత‌ర న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌కు పేరు రావ‌డం స‌హ‌జం. కానీ మాట‌ల గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నారంటే నిజంగా ఆ రైట‌ర్ త‌న‌దైన మార్కును ఎలా క్రియేట్ చేసి ఉంటాడో, అలాంటి గుర్తింపు సంపాదించుకోవ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డుంటాడో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమా తెర‌పై రైట‌ర్‌గా త‌న పేరు చూసుకోవాల‌ని ఆయ‌న క‌న్న క‌ల‌లు ఇప్పుడు పెద్ద సౌధాన్ని నిర్మించాయి. స్వ‌యంవ‌రం చిత్రానికి క‌థ‌, మాట‌లు అందించి రైట‌ర్‌గా జ‌ర్నీని షురూ చేశారు. ఆ సినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. చిత్రాన్ని హిలేరియ‌స్‌గా తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు విజ‌య్ భాస్క‌ర్‌కు ఎంత పేరు వ‌చ్చిందో..ఆ కుర్రాడెవ‌రో అద్భుతంగా రాశాడుఅంటూ ఆ చిత్రానికి రైట‌ర్‌గా ప‌నిచేసిన త్రివిక్ర‌మ్ గురించి అంతే మాట్లాడుకుంది ఇండ‌స్ట్రీ. తొలి సినిమాకే త‌న ట్రేడ్ మార్కును క్రియేట్ చేసిన త్రివిక్ర‌మ్‌కు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. రెండో చిత్రం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన స‌ముద్రం సినిమాకు రైట‌ర్‌గా ప‌దునైన మాట‌ల‌ను అందించి సినిమా స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించారు. విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన నువ్వేకావాలి సినిమాకు త్రివిక్ర‌మ్ అందించిన మాట‌లు కోట్ల‌ను కొల్ల‌గొట్టేలా చేశాయ‌న‌డంలో సందేహం లేదు. ఆ వెంట‌నే అదే ద‌ర్శ‌కుడుతో త్రివిక్ర‌మ్ వ‌ర్క్‌ చేసిన చిరున‌వ్వుతో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌డూప‌ర్ హిట్‌ను సాధించింది. విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన వ్వునాకునచ్చావ్ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డానికి త్రివిక్ర‌మ్ రైటింగే మేజ‌ర్ ఎసెట్ అయ్యింది. ఆ త‌ర్వాత వాసు చిత్రానికి కూడా డైలాగ్‌ రైటర్‌గా పనిచేశారు. 2002లో నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారారు త్రివిక్రమ్‌. ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లా తెర‌కెక్కిన ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌నేంటో త్రివిక్ర‌మ్ ప్రూవ్ చేసుకున్నారు. ఆ త‌ర్వాత మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ చిత్రాలకు కూడా త్రివిక్రమ్‌ మళ్లీ మాట సాయం అందించారు.

డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన మార్క్‌...

నువ్వేనువ్వే తో ద‌ర్శ‌కుడిగా మారిన త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాస్త గ్యాప్ తీసుకుని 2005లో సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా నటించిన అతడుతో మరోసారి మెగాఫోన్‌ పట్టారు. ఈ సినిమా మేకింగ్‌, టేకింగ్‌, మహేశ్‌ క్యారెక్టర్‌ను మలిచిన తీరు, సందర్భానుసారం సన్నివేశాల్లో వచ్చే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను త్రివిక్రమ్‌ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్ప‌టికీ బుల్లితెర‌పై ఈ సినిమా ప్ర‌సార‌మైతే ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోతారు. త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ జల్సాలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను స‌రికొత్త పాత్ర‌లో చూపించి ప‌వ‌ర్‌స్టార్ అభిమానులకు కిక్ అందించారు. త‌ర్వాత మ‌హేశ్ తో చేసిన ఖలేజాలో మ‌హేశ్‌ను కామెడీ యాంగిల్ ప్రెజంట్ చేసిన చాలా బావుంద‌ని అంద‌రి ద‌గ్గ‌ర అప్రిషియేష‌న్స్ ద‌క్కించుకున్నారు. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన జులాయి బ‌న్నీకి ఓ సెప‌రేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసింది. ఇక త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చేసిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అత్తారింటికి దారేది బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఆ వెంట‌నే నాన్న ప్రేమ‌, గొప్ప‌తనాన్ని చెబుతూ అల్లుఅర్జున్‌తో చేసిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తితో మ‌రో సూప‌ర్‌హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు త్రివిక్ర‌మ్‌. నితిన్‌, స‌మంత చేసిన కుటుంబ క‌థా చిత్రం అఆతో నితిన్ మార్కెట్ రేంజ్‌ను అమాంతం పెంచేశారు. ఇక అజ్ఞాత‌వాసిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో కొత్త‌గా చూపించారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో చేసిన అర‌వింద స‌మేత‌ను త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన తీరు చూసి ప్రేక్ష‌కాభిమానులు సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వీర‌రాఘ‌వుడిగా ఎన్టీఆర్‌ను త్రివిక్ర‌మ్ ప్రెజెంట్ తీరుకి అంద‌రూ నీరాజ‌నం ప‌లికారు.

హ్యపీ బర్త్‌డే టు మాటల మాంత్రికుడు, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌

'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ హిట్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌తో జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన త్రివిక్రమ్‌ మూడోసారి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం భారీ హిట్‌ను సాధించింది. రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించి బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీగా నిలిచింది. బన్నీ, త్రివిక్రమ్‌ కాంబోలో ఇది హ్యాట్రిక్‌ హిట్‌గా నిలిచింది.

ఎన్టీఆర్‌ 30తో బిజీ బిజీ

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో.. అరవింద సమేత వీరరాఘవ వంటి భారీ హిట్‌ను సాధించారు త్రివిక్రమ్‌. ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం సినిమాతో బిజీగా ఉన్న తారక్‌ ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేయబోతున్నారు. ఎస్‌.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.

రైట‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించి మోస్ట్‌వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా మారిన త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ పుట్టిన‌రోజు న‌వంబ‌ర్ 7. ఇలాంటి పుట్టినరోజులను ఆయన మరెన్నింటినో సెలబ్రేట్‌ చేసుకోవాలి.

................హ్యాపీ బర్త్‌ డే టు త్రివిక్రమ్‌.........

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment